Kurnool: కల్లూరులో 'రెండు ఏళ్ల నమ్మకం-అభివృద్ధి-సంక్షేమం' ఇంటింటి ప్రచారం

Kurnool: 32వ వార్డులో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ టీడీపీ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 28 Aug 2026 9:33 PM IST
Kurnool
X

Kurnool: కల్లూరులో 'రెండు ఏళ్ల నమ్మకం-అభివృద్ధి-సంక్షేమం' ఇంటింటి ప్రచారం

కర్నూలు: కల్లూరు అర్బన్ 32 వ వార్డ్ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు 2 ఏళ్ల నమ్మకం–అభివృద్ధి–సంక్షేమం’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన పాణ్యo నియోజకవర్గం టిడిపి యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు

ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపాను. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో టైలర్ నాగరాజు,ఖాజా బందే నవాజ్, రవి ప్రకాశ్ రెడ్డి, పియు మాదన్న, వలీ,మరియు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story