Kurnool: ఎమ్మిగనూరులో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన

Kurnool: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కొనసాగుతున్న విద్యాసంస్థల బంద్. నీట్ పేపర్ లీక్‌పై సోమప్ప సర్కిల్ వద్ద విద్యార్థి సంఘాల జేఏసీ ధర్నా.

S Khaleel, Yemmiganur
Published on: 24 July 2026 5:30 PM IST
Kurnool
X

Kurnool: ఎమ్మిగనూరులో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన

కర్నూలు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విద్యా సంస్థల బంద్ కొనసాగుతోంది. నీట్ పేపర్ లీక్,ఢిల్లీ లో విద్యార్థులు, ఉద్యమ కారుల పై లాఠీచార్జ్ కు నిరసనగా విద్యార్థి సంఘాల బంద్ పిలుపుతో పట్టణంలోని ప్రయివేట్ విద్యా సంస్థలు మూతపడ్డాయి. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్-టీచర్స్ మీటింగ్స్ కొనసాగుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్ వద్ద విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.మంత్రి రాజీనామా చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు

S Khaleel, Yemmiganur

S Khaleel, Yemmiganur

Next Story