Kurnool: పీజీఆర్ఎస్ సేవలపై ప్రజల అభిప్రాయం కోసం క్యూఆర్ కోడ్
Kurnool: కర్నూలు జిల్లాలో పీజీఆర్ఎస్ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజల స్పందన కోరుతోందని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి తెలిపారు.
Kurnool: పీజీఆర్ఎస్ సేవలపై ప్రజల అభిప్రాయం కోసం క్యూఆర్ కోడ్
కర్నూలు: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) పై ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ప్రభుత్వం ఒక QR కోడ్ ను రూపొందించిందని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)పై ప్రజలు తమ స్పందన తెలియజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికను మరింత పారదర్శకత,జవాబుదారీ తనంతో, నిరంతర అభిప్రాయ సేకరణ చేసి పౌరుల సంతృప్తిని మెరుగు పరచడం,వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా క్యూ ఆర్ కోడ్ ద్వారా ప్రజల స్పందనను తెలుసుకోవడం జరుగుతోందని, కావున ప్రజలు ఈ వ్యవస్థపై తమ అభిప్రాయాలను తెలియచేయాలని కలెక్టర్ కోరారు.
Next Story




