Kurnool: పల్స్ పోలియోలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల సేవలు
Kurnool: కల్లూరు రవీంద్ర పాఠశాల పల్స్ పోలియో కేంద్రంలో ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల MLT, MPHW విద్యార్థులు 300 మంది చిన్నారులకు చుక్కలు వేశారు.
Kurnool: పల్స్ పోలియోలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల సేవలు
కర్నూలు: కల్లూరు మండలం చింతల ముని ఆశ్రమం సమీపంలోని రవీంద్ర పాఠశాలలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల MLT మరియు MPHW విద్యార్థులు చురుకుగా పాల్గొని తమ సేవలను అందించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేయడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 300 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగింది.
చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ, పోలియో నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రజల్లో ఆరోగ్య అవగాహన కల్పించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ గారు (గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్) మాట్లాడుతూ… ఆరోగ్య రంగంలో వృత్తి విద్యా విద్యార్థుల పాత్ర ఎంతో ముఖ్యమని, సమాజ సేవా కార్యక్రమాల్లో విద్యార్థులు భాగస్వాములు కావడం ద్వారా సేవా భావం పెంపొందుతుందని తెలిపారు.
భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజా ఆరోగ్య కార్యక్రమాల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని సూచించారు. MLT, MPHW విద్యార్థుల సేవలను కళాశాల సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




