Kurnool: అంతర్జాతీయ సదస్సులో ప్రతిష్ఠాత్మక 'బెస్ట్ ఎడూ-లీడర్' అవార్డు
Kurnool: కోల్‌కతాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. నాగస్వామి నాయక్ 'బెస్ట్ ఎడూ-లీడర్' అవార్డు అందుకున్నారు.
Kurnool: అంతర్జాతీయ సదస్సులో ప్రతిష్ఠాత్మక 'బెస్ట్ ఎడూ-లీడర్' అవార్డు
కర్నూలు: Ministry of Education, New Delhi వారి సౌజన్యంతో కోల్‌కతాలో నిర్వహించిన RKDx Talks – EDCONFLUENCE 2026 International Conferenceలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మరియు NSS P.O డా. ఎస్. నాగస్వామి నాయక్ గారు పాల్గొన్నారు.
అంతర్జాతీయ సదస్సులో విద్యారంగానికి సంబంధించిన టెక్నికల్ పేపర్‌ను సమర్పించడంతో పాటు, విద్యార్థుల విద్యాభివృద్ధి, నూతన బోధనా విధానాలు, విద్యారంగంలో వినూత్న కార్యక్రమాలు మరియు విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విలువైన సూచనలు, సలహాలను అందించారు.
కళాశాల అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం అందించిన సూచనలు, మార్గదర్శకాలను అమలు చేస్తూ, ఈ విద్యా సంవత్సరంలో 335 మంది నూతన విద్యార్థులను చేర్పించి, కళాశాల మొత్తం విద్యార్థుల సంఖ్యను 620కి పెంచడం, Shining Star Awards సాధించడం, Job Mela నిర్వహించడం, విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన విషయాలను సదస్సులో వివరించారు.
ఈ సందర్భంగా డా. ఆర్.కే. దాస్ Ministry of Education తరఫున నిర్వహించిన ప్రత్యేక సెమినార్‌లో డా. ఎస్. నాగస్వామి నాయక్ గారి విద్యారంగ సేవలు, నాయకత్వ ప్రతిభ, కళాశాల అభివృద్ధికి చేస్తున్న కృషిని గుర్తించి Certificate of Excellence తో పాటు ప్రతిష్ఠాత్మకమైన “BEST EDU-LEADER OF THE YEAR–2026” అవార్డుకు ఎంపిక చేశారు.
భారతదేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల డీన్లు, ఛాన్సలర్లు, ప్రొఫెసర్లు, ప్రిన్సిపాల్స్తో పాటు 35 దేశాల నుంచి హాజరైన విద్యా రంగ ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును డా. ఎస్. నాగస్వామి నాయక్ అందుకున్నారు.
ఈ అవార్డు *“Exceptional Leadership, Dedication to Educational Excellence and Commitment to Empowering Young Minds”*కు గుర్తింపుగా అందజేయడం విశేషం. విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు, వారిలో నైపుణ్యాలను పెంపొందించేందుకు, విద్యారంగంలో నూతన ఆలోచనలను అమలు చేసేందుకు చేస్తున్న కృషికి ఈ అవార్డు ఒక గొప్ప గుర్తింపుగా నిలిచింది.
ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు
ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్, కమిషనర్ శ్రీ రంజిత్ బాషా, RJD డా. సి. సురేష్ బాబు డా. ఎస్. నాగస్వామి నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, మార్గదర్శకాలు, సహకారంతోనే కళాశాలను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, భవిష్యత్తులో కూడా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం మరిన్ని వినూత్న కార్యక్రమాలను చేపడతామని ప్రిన్సిపాల్ డా. ఎస్. నాగస్వామి నాయక్ తెలిపారు.
కోల్‌కతాలో జరిగిన ఈ అంతర్జాతీయ సదస్సులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకైక ప్రతినిధిగా పాల్గొని ప్రతిష్ఠాత్మకమైన అవార్డును అందుకోవడం పట్ల ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల సిబ్బంది, విద్యార్థులు మరియు విద్యాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ డా. ఎస్. నాగస్వామి నాయక్ గారికి అభినందనలు తెలిపారు.




