Kurnool Policing: కర్నూలులో అర్ధరాత్రి పోలీసుల ‘విజిబుల్’ యాక్షన్.. ప్రమాదాల నివారణకు ‘ఫేస్ వాష్’ మంత్రం!
Kurnool Policing: కర్నూలు జిల్లాలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ మరియు రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
Kurnool Policing: కర్నూలులో అర్ధరాత్రి పోలీసుల ‘విజిబుల్’ యాక్షన్.. ప్రమాదాల నివారణకు ‘ఫేస్ వాష్’ మంత్రం!
కర్నూలు: ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం, నేరాల నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాలపై నిఘా ఉంచడం లక్ష్యంగా రాత్రి వేళల్లో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము వరకు సిఐ కంబగిరి రాముడు ఆధ్వర్యంలో బ్లూ కోల్ట్స్ , క్యూఆర్టీ బృందాలతో కర్నూలు పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన గస్తీ నిర్వహిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.
రాత్రి 11 గంటల తర్వాత దుకాణాలు మూసివేయించడం పర్యవేక్షిస్తూ, అనవసరంగా బయట తిరిగేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 112/100కు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. అలాగే జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు “స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం కొనసాగుతోంది. అర్ధరాత్రి తర్వాత వాహన డ్రైవర్లను ఆపి, అలసట తగ్గేందుకు ముఖం కడిగించి, అప్రమత్తంగా ప్రయాణం కొనసాగించాలని పోలీసులు సూచిస్తున్నారు.
డ్రైవింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండి ప్రమాదాలు నివారించాలని అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని పోలీసు అధికారులు కోరారు.




