Kurnool: పంచాయతీ, స్వచ్ఛభారత్ కార్మికుల సమస్యలపై సీఐటీయూ డిమాండ్

Kurnool: కర్నూలులో ఏపీ గ్రామ పంచాయతీ వర్కర్స్ మరియు స్వచ్ఛభారత్ కార్మికుల జిల్లా కమిటీ సమావేశం జరిగింది.

V RAMAMOHAN, KURNOOL
Published on: 28 Aug 2026 6:24 PM IST
Kurnool
X

Kurnool: పంచాయతీ, స్వచ్ఛభారత్ కార్మికుల సమస్యలపై సీఐటీయూ డిమాండ్

కర్నూలు: ఏపీ గ్రామ పంచాయితీ వర్కర్స్ మరియు స్వచ్ఛభారత్ కార్మికు ల జిల్లా కమిటీ సమావేశం 28. 08.026 న యూనియన్ జిల్లా నాయకులు సుధాకర్ అధ్యక్ష తన జరిగింది. ఈ సమావేశం లో యూనియన్ గౌరవ అధ్య క్షులు పి.ఎస్.రాధాక్రిష్ణ మాట్లా డుతూ పట్టణాలను, గ్రామా లను పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యాలను కాపాడుతూ త మ ఆరోగ్యలను ఫణంగా పెడు తున్న పంచాయతీ పారిశుధ్య కార్మికుల వేతనాలు గొర్రె తోక మాదిరిగా ఎదుగు బదులు లే కుండా చాలీచాలని అంటే రూ. 6,000/- ల నుండి రూ.11,00 0/- లకు మించి లేవు.

ఈమధ్య 2018లో వచ్చిన జీవో ప్రకారం గా రూ.10,000/- లకు మించి ఉండకూడదని సాకుతో పెం చిన వేతనాలు తగ్గిస్తున్నారు. 10,000 ఉండాలన్న జీవో ఉన్న ప్పటికీ చాలా గ్రామపంచాయ తీలలో ఈరోజు వరకు 6,00 0/-నుండి 8,000/- తీసుకున్న వారికి ఇందుకోసం 10,000 చేయలేదు. అంటే గ్రామ పంచా యతీల ఆర్థిక పరిస్థితి బాగో లేదని సాకు చెబుతున్నారు.

ఆర్థిక పరిస్థితి బాగున్న పంచా యతీలలో జీవో పేరు చెబుతు న్నారు. ఇటువంటి అధికారు లకు మానవత్వం ఉందా అని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రధాని మోడీ గారు ఘనంగా ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్మికుల (గ్రీన్ అంబాసిడర్స్) పరిస్థితి అస్తవ్య స్తంగా ఉంది. ఈ పథకం ప్రారం భించి కొన్ని సంవత్సరం వరకు కేంద్ర ప్రభుత్వం రూ.6,000/-ఇ చ్చి తర్వాత ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధం అని చేతులు దులిపేసుకుంది.

ఆ రోజు నుండి సంవత్సరాల తర బడి వేతనాలు రాక అనేక ఇ బ్బందులు పడుతున్నారు. ఇది చాలదన్నట్లు రాష్ట్రంలో ప్రభు త్వాలు మారినప్పుడల్లా తమ అన్యాయాన్ని నియమించుకో వడానికి అప్పటివరకు ఉన్న స్వచ్ఛభారత్ కార్మికులను తొల గించడానికి ప్రయత్నాలు చేస్తు న్నారు. ఇది చాలా అన్యాయ మైన విషయం.

అందువలన పంచాయతీ మరియు గ్రీన్ అం బాసిడర్ కార్మికుల వేతనాలు పెంచాలని, బకాయి వేతనాలు ఇవ్వాలని, ఇ.ఎస్.ఐ.,పి.ఎఫ్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 2,3 న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరుగు నిరాహార దీక్ష లు ధర్నాల్లో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా నాయకులు బతుకమ్మ మునేప్ప,ఆంజనయ్య, యేసు రత్నం,చంద్ర తదితరులు పాల్గొ న్నారు.ఏపీ పంచాయతీ మరియు స్వ చ్ఛభారత్ వర్కర్స్ యూనియ న్ (CITU),కర్నూలు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story