Kurnool: యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి నాగమధు యాదవ్ విలేకరుల సమావేశం

Kurnool: కేంద్ర ప్రభుత్వ పాలనలో విద్యారంగం పూర్తిగా విఫలమైందని యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి నాగ మధు యాదవ్ కర్నూలులో విలేకరుల సమావేశంలో ఆరోపించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 1 Aug 2026 2:55 PM IST
Kurnool
X

Kurnool: యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి నాగమధు యాదవ్ విలేకరుల సమావేశం

కర్నూలు: కేంద్ర ప్రభుత్వ పాలనలో విద్యారంగం పూర్తిగా విఫలమైందని యుత్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి నాగ మధు యాదవ్ అన్నారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నీట్ పేపర్

లీక్ పేరుతో ఉద్యమం చేసిన విద్యార్థి యువకులపై కేంద్ర ప్రభుత్వం లాఠీ ఛార్జ్ చేసి విద్యార్థులను గాయపరిచారని మండిపడ్డారు. తక్షణమే విద్యార్థులపై దాడికి భాద్యత వహించి కేంద్ర హోంశాఖ మంత్రి అమీషా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి అన్ని రంగాల్లో విఫలం చెందిందని, రాష్ట్రంలో విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్న పట్టించుకోవడం లేదని విమర్శించారు. లేదంటే రాబోవు రోజుల్లో విద్యార్థి సమస్యలపై పోరాటానికి సిద్ధం అవుతామని తెలిపారు.

నాగ మధు యాదవ్, యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story