Kurnool: నగరాన్ని పరిశుభ్రంగా ఉంచండి.. కర్నూలు కమిషనర్ చల్లా ఓబులేసు!
Kurnool: కర్నూలు నగరంలో పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు.
Kurnool: నగరాన్ని పరిశుభ్రంగా ఉంచండి.. కర్నూలు కమిషనర్ చల్లా ఓబులేసు!
కర్నూలు: నగరంలోని ప్రధాన రహదారుల్లో పారిశుద్ధ్య పనులను మరింత ముమ్మరం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. సోమవారం ఆయన 5వ శానిటేషన్ డివిజన్‌లో మస్టర్‌ను తనిఖీ చేసి, సిబ్బంది హాజరు మరియు పనితీరును పరిశీలించారు.
అనంతరం ప్రభుత్వ అతిథి గృహం పరిసరాలు, రాజ్ విహార్, బుధవారపేట, మద్దూర్ నగర్, చెక్‌పోస్ట్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించి, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లకు పలు సూచనలు చేశారు. డివైడర్లు, ప్రధాన రహదారుల ఇరువైపులా ప్రత్యేకంగా శుభ్రత చర్యలు చేపట్టి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
అనంతరం కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా బయట వరండాలో కూడా భోజనాలు చేసే విధంగా అదనపు టేబుళ్లను ఏర్పాటు చేయించారు.
ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ రమేష్ బాబు, ఇన్‌స్పెక్టర్లు అనిల్ కుమార్, జిలానీ, హుస్సేన్, లోకేష్, ఫరూక్ తదితరులు పాల్గొన్నారు.




