Kurnool: అన్న క్యాంటీన్‌లో కమిషనర్ ఓబులేసు తనిఖీ.. సిబ్బందిపై ఫైర్!

Kurnool: కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు శనివారం పరిమళ నగర్‌లోని అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Arun Chilukuri
Published on: 27 Jun 2026 10:00 AM IST
Kurnool
X

Kurnool: అన్న క్యాంటీన్‌లో కమిషనర్ ఓబులేసు తనిఖీ.. సిబ్బందిపై ఫైర్!

కర్నూలు: అన్న క్యాంటీన్‌లో విధులు నిర్వహించాల్సిన సిబ్బంది సంఖ్యలో సగానికి పైగా లేకపోవడం ఏమిటి? పదేపదే చెప్పినా పద్దతి మార్చుకోరా? అంటూ అన్న క్యాంటీన్ పర్యవేక్షక యంత్రాంగంపై నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అసహనం వ్యక్తం చేశారు. శనివారం పరిమళ నగర్‌లోని అన్న క్యాంటీన్‌ను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో 7 మంది ఉండాల్సిన సిబ్బందిలో ముగ్గురు మాత్రమే ఉండటంతో, అన్న క్యాంటీన్ల పర్యవేక్షక యంత్రాంగానికి కమిషనర్ ఫోన్ చేసి అసహనం వ్యక్తం చేశారు. గతంలో పలుమార్లు హెచ్చరించినా ఎందుకు పద్దతి మార్చుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విధంగా ఉంటే అన్న క్యాంటీన్ సీఈఓకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

అదేవిధంగా వై. జంక్షన్, బళ్లారి చౌరస్తా, సంతోష్ నగర్, బాలాజీ నగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రతి పారిశుద్ధ్య కార్మికుడి వద్ద 8 డస్ట్‌బిన్‌లు తప్పనిసరిగా ఉండాలని, ప్రధాన రహదారులు, జాతీయ రహదారులకు ఇరువైపులా ఉన్న వాణిజ్య దుకాణాల వద్ద బిన్‌లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, జాప్యం చేస్తే రుసుము వసూలు చేసి బిన్‌లు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఆలీం బాషా, రవి, మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story