Kurnool: సెట్కూరు అన్న క్యాంటీన్ తనిఖీ చేసిన కార్పొరేషన్ కమిషనర్

Kurnool: కర్నూలు సెట్కూరు వద్దనున్న అన్న క్యాంటీన్‌ను కమిషనర్ చల్లా ఓబులేసు తనిఖీ చేశారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 24 July 2026 9:18 PM IST
Kurnool
X

Kurnool: సెట్కూరు అన్న క్యాంటీన్ తనిఖీ చేసిన కార్పొరేషన్ కమిషనర్

కర్నూలు: అన్న క్యాంటీన్లలో భోజనం చేసే ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలని, ఆహార నాణ్యత ప్రమాణాలను మరింత మెరుగుపర్చాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం ఆయన సెట్కూరు కార్యాలయం వద్దనున్న అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేశారు.

పరిసరాల పరిశుభ్రత, ఆహార నాణ్యత, తాగునీటి వసతులను పరిశీలించి, భోజనదారులతో మాట్లాడారు. డిజిటల్ విధానంలో టోకెన్ల జారీ ప్రక్రియను పరిశీలించి, లబ్ధిదారులకు టోకెన్లు అందజేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి ఒక్కరికీ తక్కువ ఖర్చుతో నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అన్న క్యాంటీన్లను నిర్వహిస్తోందన్నారు. ఒక్కో భోజనానికి ప్రభుత్వం రూ.65 సబ్సిడీ అందిస్తూ,

లబ్ధిదారుల నుంచి కేవలం రూ.15 మాత్రమే వసూలు చేసి త్రిపూటల భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పథకంలో ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని నిర్వాహకులను ఆదేశించారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story