Kurnool: పాణ్యం నియోజకవర్గంలో రూ.47 లక్షలతో సీసీ రోడ్ల ప్రారంభోత్సవం
Kurnool: కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు, పెద్దటేకూరు గ్రామాల్లో అభివృద్ధి పనులను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ప్రారంభించి, ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Kurnool: పాణ్యం నియోజకవర్గంలో రూ.47 లక్షలతో సీసీ రోడ్ల ప్రారంభోత్సవం
కర్నూలు: కల్లూరు మండలం చిన్నటేకురు మరియు పెద్దటేకూరు గ్రామాలలో రెండేళ్ల నమ్మకం అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా ముందుగా చిన్నటెకూరు గ్రామం లో ముందుగా రూ 47.00 లక్షల నిధులతో సీసీ రోడ్ల పనులు పూర్తి కావడం తో ముఖ్య అతిథులుగా పాల్గొని పాణ్యo నియోజకవర్గం,టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గౌరు చరిత రెడ్డి శిలఫలకాన్ని ప్రారంభించారు.
అనంతరం ఇంటింటి ప్రచార కార్యక్రమం లో పాల్గొన్నారు అదేవిధంగా పెద్దటేకూరు గ్రామం లో ముందుగా రూ 20 లక్షల నిధులతో సీసీ రోడ్ పనులు పూర్తి అవడం తో శిలాఫలకం ను ప్రారంభించారు అనంతరం గ్రామo లో ఇంటింటికి తిరిగి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నరూ. ప్రజల నుంచి ఎంతో మంచి స్పందన లభించింది అని ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీ కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు,పాణ్యo నియోజకవర్గం పరిశీలకులు చల్లా లక్ష్మీ ప్రసాద్,చిన్నటెకూరు గ్రామ నాయకులు రామాంజనేయులు,శేష గిరి, లక్ష్మన్న,అశోక్,రామ చంద్రుడు,రాజశేఖర్,మౌలాలి,పెద్దటేకూరు గ్రామ నాయకులు సాయి తరుణ్ కుమార్ రెడ్డి,సురేష్,రామకృష్ణ,మోహన్
నాగరాజు, పుల్లన్న, ముని స్వామి,జనసేన నాయకుడు బజారన్న,ఉలిందకొండ సొసైటీ చైర్మన్ ఇవి రమణ,తడకనపల్లి మాజీ సర్పంచ్ సహారా బి,క్లస్టర్ ఇంచార్జి మహానంది,ప్రభుత్వ అధికారులు,సచివాలయ ఉద్యోగులు మరియు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




