Kurnool: మంత్రి సత్యకుమార్ నిరాడంబరతకు అధికారుల ఫిదా

Kurnool: కర్నూలు జిల్లా ఆస్పిరి పీహెచ్‌ఎంలో ప్రొటోకాల్ భేషజాలకు దూరంగా, సిబ్బందితో కలిసి సాదాసీదాగా ఫొటో దిగిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్.

V RAMAMOHAN, KURNOOL
Published on: 26 July 2026 7:24 AM IST
Kurnool
X

Kurnool: మంత్రి సత్యకుమార్ నిరాడంబరతకు అధికారుల ఫిదా

కర్నూలు: మంత్రి వస్తున్నారంటే... ప్రొటోకాల్, హడావుడి, దూరంగా నిలబడే అధికారులు, సిబ్బంది... ఇవే సాధారణంగా కనిపించే దృశ్యాలు. కానీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారి వ్యవహారశైలి మాత్రం ఇందుకు భిన్నంగా కనిపించింది.

ఆస్పిరి పీహెచ్సీ లో సంజీవని ప్రారంభ కార్యక్రమం ముగిసిన తర్వాత అధికారులు, ఉద్యోగులు ఫొటో కోసం ముందుకొచ్చారు. ప్రత్యేక ఏర్పాట్లు చేయించకుండా, హడావుడి లేకుండా, వారిలో ఒకరిగా నిలబడి అందరితో కలిసి మంత్రి ఫొటో దిగారు. పదవికి తగిన ఆర్భాటం, భేషజాలు ఏమాత్రం ప్రదర్శించకుండా సహజంగా వ్యవహరించిన తీరు అక్కడున్న అధికారులను, సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది.

మంత్రి హోదాలో ఉన్నప్పటికీ అందరినీ ఆప్యాయంగా పలకరించడం, ఎలాంటి సంకోచం లేకుండా కలిసిమెలిసి ఉండడం ఉద్యోగులను ఆకట్టుకుంది.నిరాడంబరత, అందుబాటులో ఉండే స్వభావమే సత్యకుమార్ ప్రత్యేకతగా నిలుస్తోందని, అదే అధికారులు, సిబ్బందితో ఆయనకు సాన్నిహిత్యాన్ని పెంచుతోందన్న భావన అక్కడ వ్యక్తమైంది.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story