Kurnool: కర్నూలు మెడికవర్ హాస్పిటల్స్‌లో అరుదైన వైద్య అద్భుతం: నవజాత శిశువుకు క్లిష్టమైన సర్జరీ విజయవంతం..

Kurnool: కర్నూలు మెడికవర్ హాస్పిటల్స్‌లో నవజాత శిశువుకు పుట్టుకతో వచ్చిన అత్యంత అరుదైన జీర్ణాశయ సమస్యకు సర్జరీ విజయవంతమైంది. లక్ష మందిలో ఒకరికి వచ్చే ఈ లోపాన్ని డా. సింధూర బృందం నయం చేసింది.

V RAMAMOHAN, KURNOOL
Published on: 30 May 2026 7:30 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలు మెడికవర్ హాస్పిటల్స్‌లో అరుదైన వైద్య అద్భుతం: నవజాత శిశువుకు క్లిష్టమైన సర్జరీ విజయవంతం..

కర్నూలు: మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలులో నవజాత శిశువు(36 వారాలు)కు లక్ష మందిలో ఒకరికి మాత్రమే కనిపించే అత్యంత అరుదైన జీర్ణాశయ సంబంధిత పుట్టుకతో వచ్చే సమస్యను విజయవంతంగా గుర్తించి చికిత్స అందించారు. ఈ అరుదైన కేసులో పీడియాట్రిషన్ & నీయోనటాలజిస్ట్ డా. కె. సింధూర గారు కీలక పాత్ర పోషించారు.

ప్రీ-టర్మ్‌(36 వారాలు)గా జన్మించిన ఈ మగ శిశువు తక్కువ బరువుతో (1.8 కిలోలు) జన్మించాడు. పుట్టిన వెంటనే శిశువు ఏడ్చినప్పటికీ, పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించిన డా. సింధూర గారు తదుపరి పరీక్షల కోసం శిశువును NICUకి తరలించారు. శిశువుకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో ఓజీ ఆస్పిరేషన్ ద్వారా 25 మిల్లీలీటర్ల ద్రవం బయటకు రావడంతో డా. సింధూర గారు సమస్యను ముందుగానే గుర్తించి అవసరమైన పరీక్షలను సూచించారు. అనంతరం నిర్వహించిన ఎక్స్-రే మరియు Upper GI Contrast Study ద్వారా శిశువుకు అత్యంత అరుదైన జన్యుపరమైన జీర్ణాశయ అడ్డంకి ఉన్నట్లు నిర్ధారణ అయింది.

కేసు క్లిష్టతను దృష్టిలో ఉంచుకొని డా. సింధూర గారు, సీనియర్ పీడియాట్రిక్ సర్జన్ డా. సునీల్ కుమార్ రెడ్డి గారితో కలిసి బహుళ విభాగాల వైద్య బృందాన్ని సమన్వయం చేసి చికిత్సను ముందుకు తీసుకెళ్లారు. అనంతరం సీనియర్ పీడియాట్రిక్ సర్జన్ డా. సునీల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్యాస్ట్రోడ్యూడెనోస్టమీ (Gastroduodenostomy) శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం NICUలో ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి 7 రోజుల పాటు NBM కొనసాగించారు. తర్వాత 3 మిల్లీలీటర్లతో ప్రారంభించిన ఫీడింగ్‌ను క్రమంగా పెంచుతూ ప్రస్తుతం 32 మిల్లీలీటర్ల వరకు అందిస్తున్నారు. తల్లి పాలతో పాటు శిశువు ఆరోగ్యం మెరుగుపడుతూ బరువు కూడా పెరుగుతోంది.

ఈ చికిత్సలో పీడియాట్రిషన్ & నీయోనటాలజిస్ట్ డా. కె. సింధూర గారు, సీనియర్ పీడియాట్రిక్ సర్జన్ డా. సునీల్ కుమార్ రెడ్డి గారు, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డా. వై. గణేష్ గారు మరియు NICU బృందం సమిష్టిగా పనిచేసి శిశువుకు కొత్త జీవితం అందించారు.

ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ, “అత్యంత అరుదైన మరియు క్లిష్టమైన నవజాత శిశువు కేసును మా నీయోనటాలజీ, పీడియాట్రిక్ సర్జరీ మరియు NICU బృందాలు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడం గర్వకారణం. ముఖ్యంగా సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స అందించిన డా. సింధూర మరియు వైద్య బృందాన్ని అభినందిస్తున్నాము” అని తెలిపారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story