Kurnool: ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాలలో అక్షరాస్యత దినోత్సవం

Kurnool: కర్నూలులో జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశాల మేరకు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో అక్షరాస్యత దినోత్సవం, ర్యాగింగ్ వ్యతిరేక సదస్సు నిర్వహించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 9 Sept 2026 5:46 PM IST
Kurnool
X

Kurnool: ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాలలో అక్షరాస్యత దినోత్సవం

కర్నూల్: ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలల్లో అక్షరాస్యత దినోత్సవం మరియు ర్యాగింగ్‌పై అవగాహన సదస్సు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి గారి ఆదేశాల మేరకు కళాశాలల్లో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో అక్షరాస్యత దినోత్సవం మరియు ర్యాగింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ మరియు NSS P.O డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అక్షరాస్యత ప్రాముఖ్యత, విద్య ద్వారా వ్యక్తిగత మరియు సామాజిక అభివృద్ధి, ప్రతి ఒక్కరూ విద్యావంతులుగా మారాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు.

అనంతరం ర్యాగింగ్ వల్ల కలిగే దుష్పరిణామాలు, విద్యార్థులపై దాని ప్రభావం, ర్యాగింగ్‌కు పాల్పడితే ఎదురయ్యే చట్టపరమైన చర్యలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాలలో ర్యాగింగ్‌కు తావులేకుండా ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో, స్నేహభావంతో మెలగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మల్లికార్జున, విజయశేఖర్, ఉల్గోజీ రావు, సోమేశ్, శ్రీధర్ మూర్తి, బాలూ, ఇంతియాజ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story