Kurnool: కర్నూలులో జైల్‌భరో వాల్‌పోస్టర్ ఆవిష్కరణ, బైక్ ర్యాలీ

Kurnool: నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని, ఆగస్టు 10న జైల్‌భరోను విజయవంతం చేయాలని కర్నూలులో రైతు, కార్మిక సంఘాల నేతల పిలుపు. బైక్ ర్యాలీ ప్రారంభం.

V RAMAMOHAN, KURNOOL
Published on: 8 Aug 2026 7:19 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలులో జైల్‌భరో వాల్‌పోస్టర్ ఆవిష్కరణ, బైక్ ర్యాలీ

కర్నూలు: అమెరికాతో భారత ప్రభుత్వం చేసుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం మన రాష్ట్రంలోని రైతాంగానికి ఆక్వా రైతులకు నష్టాలు జరుగుతాయని, పని గంటలు పెంచుతూ కార్మికులకు వ్యతిరేకంగా యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నటువంటి నాలుగు లేబర్ కోడ్స్ ని వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గౌరవ అధ్యక్షులు పి రామచంద్రయ్య డిమాండ్ చేశారు.

శనివారం నాడు సి క్యాంప్ లో 10 వ తేదీ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో జరిగే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతు కార్మిక వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఏపీ రైతు సంఘం గౌరవ అధ్యక్షులు పి రామచంద్రయ్య జండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్కి లెనిన్ బాబు ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే జగన్నాథం టి యు సి ఐ జిల్లా కార్యదర్శి తిరుపాలు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాల అవలంబిస్తూ పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయడం సిగ్గుచేటని యాజమాన్యాలకు అనుగుణంగా నాలుగు లేబర్ కోడ్స్ తీసుకురావడం వీటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

దేశంలో వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయని పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేకపోవడంతో రైతుల ఆత్మహత్యలు పాల్పడుతున్నారని అన్నారు. కౌలు రైతులకు పంట రుణాలు అందించే విధంగా మన పాలకుల్లో నిజాయితీ కొరవడిందని రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్న మోడీ ప్రభుత్వం రైతన్న ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుపోలేదని ఆరోపించారు.

కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి

పోరాటాల ద్వారా సాధించుకున్న కనీస వేతనాలు చట్టం, కార్మికుల సంక్షేమం కోసం సమ్మె చేసే హక్కు ఉద్యోగ భద్రత మహిళా కార్మికుల హక్కులు, ఎనిమిది గంటల పని విధానం వివిధ చట్టాలు సాధించుకుంటే మోడీ ప్రభుత్వం వాటిని రద్దు చేసి యాజమాన్యాలకు ఊడిగం చేస్తూ నాలుగు లేబర్ కోడ్స్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతాయని వీటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

అందరికీ కనీస వేతనాలు 31,000 ఇవ్వాలని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర, పట్టణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలని, కర్నూలు జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి వేదవతి గుండ్రేవుల రిజర్వాయర్లు పూర్తిచేసి కర్నూలు జిల్లా కరువు నివారణ చర్యలు చేపట్టాలని, కరువు నేపథ్యంలో రైతులకు ఇచ్చిన బ్యాంకు రుణాలు రద్దు చేసి అందరినీవా కాలవధార జిల్లాలో సాగునీరు అందించేందుకు పంట కాలువలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ ఏఐటీయూసీ నగర అధ్యక్షులు జి చంద్రశేఖర్, రైతు సంఘం కల్లూరు మండల కార్యదర్శి రాముడు సి ఐ టి యు నాయకులు నర్సింలు నాగేష్ రఫీ సుధాకర్ అప్ప ఏఐటీయూసీ నాయకులు రామాంజనేయులు నల్లన్న పురుషోత్తం ప్రణీత్ రవికుమార్ టి యు సి ఐ నాయకులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story