Kurnool: బస్తిపాడు ప్రభుత్వ భూమి ఆక్రమణలపై కాటసాని సీరియస్

Kurnool: కల్లూరు మండలం బస్తిపాడులో 1.93 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాపై కఠిన చర్యలు తీసుకోవాలని తహసిల్దార్‌ను కోరిన వైఎస్సార్‌సీపీ నేత కాటసాని రామభూపాల్ రెడ్డి.

V RAMAMOHAN, KURNOOL
Published on: 1 Aug 2026 5:43 PM IST
Kurnool
X

Kurnool: బస్తిపాడు ప్రభుత్వ భూమి ఆక్రమణలపై కాటసాని సీరియస్

కర్నూలు: బస్తిపాడు గ్రామ పొలిమేరలోని సమాధుల పల్లెలో సర్వే నంబర్ 382లో ఉన్న సుమారు 1.93 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసి సాగు చేస్తున్న వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కల్లూరు తహసిల్దార్ గారిని కోరిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి.

కాటసాని రామభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ భూములను ఆక్రమించడం ప్రజల హక్కులపై దాడితో సమానమని అన్నారు. బస్తిపాడు గ్రామంలోని సర్వే నంబర్ 382లో ఉన్న సుమారు 1.93 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి సాగు చేస్తున్న వారిని వెంటనే ఖాళీ చేయించి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు...

ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం అధికారుల ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్న ఆయన, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ కబ్జాదారుల చెరలోకి వెళ్లనివ్వబోమని స్పష్టం చేశారు..

ప్రజల ఆస్తులను కాపాడేందుకు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని, అక్రమాలకు పాల్పడే వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కాటసాని రామభూపాల్ రెడ్డి హెచ్చరించారు..

ఈ కార్యక్రమంలో బస్తిపాడు గ్రామ నాయకులు కల్లా వెంకటరమణారెడ్డి, మాజీ కార్పొరేటర్లు నారాయణ రెడ్డి, దండు లక్ష్మీకాంత రెడ్డి, అక్కిమి హనుమంత రెడ్డి గారు,పందిపాడు శివశంకర్ రెడ్డి, తిరుపాల్, సాయి కృష్ణ, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు...

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story