Kurnool: గూడూరులో రోడ్డు ప్రమాదం.. మృతదేహంతో రాస్తారోకో, ఉద్రిక్తత!

Kurnool: కర్నూలు జిల్లా గూడూరులో బైక్‌ను ట్రాక్టర్ ఢీకొని ఎర్రన్న అనే వ్యక్తి మృతి. నష్టపరిహారం కోరుతూ మృతదేహంతో బంధువుల రాస్తారోకో, నిలిచిపోయిన ట్రాఫిక్.

C. Ganesh, Kodumuru
Published on: 29 Aug 2026 7:30 PM IST
Kurnool
X

Kurnool: గూడూరులో రోడ్డు ప్రమాదం.. మృతదేహంతో రాస్తారోకో, ఉద్రిక్తత!

Kurnool: కర్నూలు జిల్లా గూడూరు లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.నిన్న కర్నూలు శివారు ప్రాంతంలో మోటార్ బైక్ ను, ట్రాక్టర్ ఢీకొంది.ఈ ఘటనలో ఎర్రన్న (40) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.

మృతుడు ఎర్రన్న కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆయన బంధువులు, గ్రామస్థులు గూడూరు పాత బస్టాండ్ వద్దకు చేరుకిని మృతదేహంను అంబులెన్స్ ఉంచి రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

దీంతో కర్నూలు-ఎమ్మిగనూరు ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru

Next Story