Kurnool: కర్నూలు వృత్తి విద్యా కళాశాలలో ఘనంగా 'మెగా PTM 4.0'
Kurnool: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో మెగా PTM 4.0 ఘనంగా జరిగింది.
Kurnool: కర్నూలు వృత్తి విద్యా కళాశాలలో ఘనంగా 'మెగా PTM 4.0'
కర్నూలు: ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో మెగా PTM (Parent Teacher Meeting) 4.0 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కె.వి. సుబ్బారెడ్డి ఆధినేత కె.వి. సుబ్బారావు రెడ్డి, పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాల ఆధినేత పుల్లయ్య, డీఎస్పీ ఎస్. బాషా, ప్రముఖ చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ సురేష్ చంద్ర, అలాగే డీవీఈఓ సురేష్ హాజరై విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ మాట్లాడుతూ, విద్యార్థుల విజయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయం ఎంతో కీలకమని తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించి ఉన్నత స్థానాలను చేరుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలలో అందుతున్న నాణ్యమైన విద్య, వృత్తి నైపుణ్య శిక్షణ, క్రమశిక్షణ, అధ్యాపకుల అంకితభావాన్ని కొనియాడుతూ తమ అనుభవాలను పంచుకున్నారు. కళాశాల అభివృద్ధికి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ మరియు అధ్యాపక బృందం చేస్తున్న కృషిని వారు ప్రత్యేకంగా అభినందించారు.
ఇటీవల "షైనింగ్ స్టార్" అవార్డు అందుకున్న ఈఈటీ విద్యార్థి వరద సాయి పురేందేశ్వర్ మరియు వారి తల్లిదండ్రులను ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ఘనంగా సన్మానించి అభినందించారు. విద్యార్థి సాధించిన విజయాన్ని ఆదర్శంగా తీసుకుని మరింత మంది ఉన్నత ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వాణి ప్రసన్న, ప్రసన్న కుమార్, మల్లికార్జున, విజయ శేఖర్, రామకృష్ణ, కృష్ణమోహన్, జబీన్ అక్తర్, గిరిజారాణి, సుజాత, లక్ష్మి, సోమేష్, పటేల్, శారధి పటేల్, ఉల్గోజి రావు, శ్రీధర్ మూర్తి, బాల శంకర్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




