Kurnool: ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్‌కు జాతీయ పురస్కారం!
Kurnool: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాల ప్రిన్సిపాల్, ప్రముఖ విద్యావేత్త నాగస్వామి నాయక్‌కు ప్రతిష్టాత్మక "దళిత బంధు నేషనల్ అవార్డు – 2026" దక్కింది.
Kurnool: ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్‌కు జాతీయ పురస్కారం!
కర్నూలు: ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాల ప్రిన్సిపాల్, ప్రముఖ విద్యావేత్త, సామాజిక సేవకుడు లయన్ డా. ఎస్. నాగస్వామి నాయక్ గారికి విద్యా మరియు సామాజిక సేవా రంగాల్లో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా బాబూ జగ్జీవన్ రామ్ మెమోరియల్ ఆర్గనైజేషన్, విశాఖపట్నం వారు ప్రతిష్టాత్మకమైన దళిత బంధు నేషనల్ అవార్డు–2026 ను ప్రదానం చేయనున్నారు.
డా. నాగస్వామి నాయక్ గారు విద్యా రంగంలో వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తూ వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రభుత్వ విద్యను ప్రజలకు మరింత చేరువ చేయడంలో, విద్యార్థులను ఉన్నత లక్ష్యాల వైపు ప్రోత్సహించడంలో ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని పలువురు విద్యావేత్తలు కొనియాడుతున్నారు.
విద్యతో పాటు రక్తదాన శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ, యోగా, మాదకద్రవ్యాల నిర్మూలన, బాల్య వివాహాల నివారణ, ఓటరు చైతన్యం, సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడంలో ఆయన విశేష పాత్ర పోషిస్తున్నారు.
డా. నాగస్వామి నాయక్ ఇప్పటికే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు, సత్కారాలు అందుకొని కళాశాలకు, కర్నూలు జిల్లాకు విశిష్ట గుర్తింపు తీసుకువచ్చారు. ఈ "దళిత బంధు నేషనల్ అవార్డు–2026" ఆయన సేవలకు మరో గొప్ప గుర్తింపుగా నిలిచింది.
ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ డా. నాగస్వామి నాయక్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఆయన నాయకత్వంలో కళాశాల మరిన్ని విజయాలు సాధించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింత కీర్తి ప్రతిష్ఠలు పొందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మల్లికార్జున, విజయ శేఖర్, రామకృష్ణ, సోమేష్, ఉల్గోజి రావు, శారధి పటేల్, చిన్న మల్లేష్, కృష్ణమోహన్, శ్రీధర్ మూర్తి, బాల శంకర్ తదితరులు పాల్గొని ప్రిన్సిపాల్ డా. ఎస్. నాగస్వామి నాయక్ గారిని ఘనంగా అభినందించారు.




