Kurnool: కాంట్రాక్ట్ సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్న జీజీహెచ్ సూపరింటెండెంట్!

Kurnool: కర్నూలు జీజీహెచ్‌లోని కాంట్రాక్ట్ సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్న సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు. సేవలకు అంతరాయం కలగొద్దని సూచన.

V RAMAMOHAN, KURNOOL
Published on: 29 Aug 2026 3:41 PM IST
Kurnool
X

Kurnool: కాంట్రాక్ట్ సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్న జీజీహెచ్ సూపరింటెండెంట్!

Kurnool: ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరసన నేపథ్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కే. వెంకటేశ్వర్లు వారిని పిలిపించి మాట్లాడారు.

ఈ సందర్భంగా కాంట్రాక్ట్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను సూపరింటెండెంట్ అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది వివరించిన సమస్యలను సంబంధిత పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.

అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఆసుపత్రి వైద్య సేవల్లో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులకు హాజరై తమ విధులను నిర్వర్తించాలని సూపరింటెండెంట్ డాక్టర్ కే. వెంకటేశ్వర్లు సూచించారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story