Kurnool: 'యోగాంధ్ర' జోష్.. కర్నూలు ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక యోగా కార్యక్రమం!
Kurnool: కర్నూలు ఇండోర్ స్టేడియంలో ఘనంగా 'యోగాంధ్ర' కార్యక్రమం. జూన్ 21న 5.5 లక్షల మందితో యోగా చేసేందుకు ప్రణాళికలు.
Kurnool: 'యోగాంధ్ర' జోష్.. కర్నూలు ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక యోగా కార్యక్రమం!
కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “యోగాంధ్ర” కార్యక్రమంలో భాగంగా కర్నూలులోని ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం రానున్న సందర్భంగా కర్నూలు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో యోగాను ప్రోత్సహించేందుకు యోగ సాధన, పిల్లలకు పోటీ నిర్వహిస్తున్నామని ఈ నెల 21వ తేదీన ఐదున్నర లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తామని ప్రజలు తమ దైనందిక అలవాటులో యోగాను ఓ అరగంట పాటు చేయాలని దీని ద్వారా ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో ఉపయోగపడుతుందని సెట్కర్ సీఈఓ వేణుగోపాల్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, జిల్లా అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Next Story




