Kurnool: రైతుల ఘోష ప్రభుత్వానికి పట్టదా?: సీపీఐ నేత జగన్నాథం ధ్వజం!
Kurnool: కర్నూలు కోడుమూరులో ఎండిన పంటలను పరిశీలించిన సీపీఐ నేత జగన్నాథం, వర్షాభావంతో నష్టపోయిన రైతులకు ఎకరానికి ₹50,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Kurnool: రైతుల ఘోష ప్రభుత్వానికి పట్టదా?: సీపీఐ నేత జగన్నాథం ధ్వజం!
కర్నూలు జిల్లా:
రైతుల ఘోష ప్రభుత్వానికి పట్టదా? సిపిఐ వ్యవసాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం
కర్నూలు జిల్లా కోడుమూరులో సిపిఐ వ్యవసాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం ఆధ్వర్యంలో వర్షాభావ పరిస్థితులవల్ల పంటనష్ట పోయినా పొలాలను పరిశీలించారు.రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రైతులు నష్టపోతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదని జగన్నాథం విమర్శించారు.ఎన్నికల్లో రైతుల ఓట్లతో గెలిచినా ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ధి పేరిట రైతుల భూములను కార్పోరేట్ సంస్థలకు అప్పగిస్తుందని ఆరోపించారు.కర్నూలు జిల్లాలో ఇద్దరు మినహా అంతా టిడిపి ఎమ్మెల్యే లు ఉన్న కూడా ప్రయోజనం లేదన్నారు.వర్షలు లేక పంటలు ఎండిపోతుంటే రైతుల ఘోష వినే నాయకుడే లేడని ఆవేదన వ్యక్తంచేశారు.తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల రుణాలను మాఫీ చేస్తున్నాడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను పట్టించుకోవడం లేదన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పంట నష్టం పోయిన రైతులకు ఎకరాకు 50 వేలు పంట నష్టపరిహారం ఇవ్వాలని జగన్నాథం డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చెపడతమని హెచ్చారించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ వ్యవసాయ సంఘం నాయకులు రామాంజనేయులు,మునెప్ప, శేషు కుమార్ యాదవ్,రాజు,శివశంకర్,అంజి పాల్గొన్నారు




