Kurnool: సంక్షేమ హాస్టళ్లపై నిరంతర పర్యవేక్షణ, థర్డ్ పార్టీ ఆడిట్!
Kurnool: కర్నూలు జిల్లాలో విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులకు ఆదేశం.
Kurnool: సంక్షేమ హాస్టళ్లపై నిరంతర పర్యవేక్షణ, థర్డ్ పార్టీ ఆడిట్!
Kurnool: జిల్లాలోని విద్యార్థులు మరియు సంక్షేమ వసతి గృహాలలో ని విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, వీరిపై గట్టిగా నిఘా ఉంచి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ , సంక్షేమ వసతి గృహాల మరియు ఈగల్ టీమ్ అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలోని పాఠశాలలు , కాలేజీలు , సంక్షేమ వసతిగృహాల లోని విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, ఈ అంశంపై సంబంధిత శాఖల అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హాస్టళ్లలో విద్యార్థుల ప్రవర్తనను నిరంతరం గమనిస్తూ ఉండాలన్నారు. యువత భవిష్యత్ ను కాపాడడం బాధ్యతగా భావించాలన్నారు మత్తు పదార్థాలు సేవించడం వల్ల కలిగే అనర్థాలు, కేసుల నమోదుపై విద్యార్థులందరికీ పూర్తిగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
వాల్ పోస్టర్లు , స్టిక్కర్ ల ద్వారా మరియు మీడియా ద్వారా ఈ విషయాన్ని జిల్లాలో అందరికీ తెలిసే లాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో డ్రగ్స్ లేకుండా చర్యలు చేపట్టాలని ఈగల్ టీమ్ ను ఆదేశించారు. విద్యాసంస్థల పరిసరాలలో ఉన్న దుకాణాలపై గట్టి నిఘా ఉంచి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.
ఆదోని రెవెన్యూ డివిజన్ లోని కొన్ని మండలాలు చిప్పగిరి , పెద్ద హరివాణం , హాలహర్వి , ఆలూరు లోని కొన్ని గ్రామాల రైతులు మరియు ఇతరులు రహస్యంగా గంజాయి సాగు చేస్తున్నట్టు సమాచారం ఉందని, సాగు చేస్తున్నట్లయితే వారిపై వెంటనే కేసులు పెట్టి అరికట్టే చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారి వరలక్ష్మిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సంక్షేమ శాఖ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లోని సిబ్బంది ఎటువంటి అవకతవకలకు పాల్పడరాదని, విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాలని వారికి మంచి పౌష్టికాహారము , తాగునీరు అందించాలని ఆదేశించారు.
వసతి గృహాల్లో మంచి సౌకర్యాలు, నీటి వసతి , మెష్ ల ఏర్పాటు , టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండడం మంచి ప్రశాంతం వాతావరణము కలిగి ఉండే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వసతి గృహాలపై అవసరమైతే థర్డ్ పార్టీ ఆడిట్ చేయిస్తామని హెచ్చరించారు. ఇంకా వసతి గృహాలకు కావలసిన ఏర్పాట్లకు సంబంధించిన నివేదికలతో రావాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి , డి ఈ ఓ సుధాకర్ , ఎస్ ఎస్ ఏ పిఓ లోకరాజు , ఆర్ ఐ ఓ లాలెప్ప , జిల్లా ఎస్ సి , బి సి సంక్షేమ అధికారులు రాధిక , ప్రసూన , డి వి వి సురేష్ బాబు , రెసిడెన్టీయల్ స్కూల్స్ కో ఆర్డినేటర్ పుష్ప రాజ్ , మైనారిటీ వెల్ఫేర్ అధికారిని సబిహా పర్వీన్ , జ్యోతి బా పూలె విద్యాలయ జూనియర్ లెక్షరర్ యమునా దేవి , లీగల్ టీం ఎస్సై రమేష్ నాయక్ , హెడ్ కానిస్టేబుల్ ఎలీషా తదితరులు పాల్గొన్నారు.




