Kurnool: కర్నూలులో టూరిజం అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష!

Kurnool: కర్నూలు జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కొత్త ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 4 Sept 2026 11:57 AM IST
Kurnool
X

Kurnool: కర్నూలులో టూరిజం అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష!

Kurnool: జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కొత్త పర్యాటక ప్రాంతాలను గుర్తించి, సమగ్ర అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి టూరిజం అధికారిని ఆదేశించారు.

గురువారం కలెక్టర్ కార్యాలయంలో పర్యాటక రంగ పురోగతిపై పర్యాటక కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంత్రాలయం దేవాలయం సమీపంలో హ్యాండ్లూమ్ ఉత్పత్తుల విక్రయ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని కలెక్టర్ చేనేత అధికారులను ఆదేశించారు..

చిన్నతుంబలం చెరువు, నాగలాపురం సుంకులమ్మ, వెంకాయపల్లె ఎల్లమ్మ తదితర ప్రాంతాల్లో పర్యాటక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలను గుర్తించి, అవసరమైన మౌలిక వసతుల కల్పనతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు..

అదే విధంగా జగన్నాథ గట్టు, బ్రహ్మగుండం, ఉరుకుంద, కేతవరం తదితర పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన లీజు ప్రక్రియను పూర్తి చేసి, తదుపరి చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు...

పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ద్వారా జిల్లాకు వచ్చే సందర్శకుల సంఖ్య పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి, ఆర్థిక అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంటుందన్నారు.. జిల్లాలో ఇప్పటికే ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కూడా సమగ్రంగా అభివృద్ధి చేసి, సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

సమావేశంలో టూరిజం అధికారి తిరుమల నాయుడు, ఇరిగేషన్ శాఖ,Dy. SE మల్లికార్జున రెడ్డి, డ్వామా ఏపిడి మాధవి లత , దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి, సెట్కూర్ సీఈవో వేణుగోపాల్, డివిజనల్ మేనేజర్, APTDC లక్ష్మీ నారాయణ, EE, APTDC శివ నాగేశ్వర రావు, కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు.పత్తి ఓబులయ్య, టూర్స్ & ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story