Kurnool: పీజీఆర్ఎస్ అర్జీలపై నిర్లక్ష్యం తగదు: కలెక్టర్ స్పష్టం!
Kurnool: కర్నూలు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
Kurnool: పీజీఆర్ఎస్ అర్జీలపై నిర్లక్ష్యం తగదు: కలెక్టర్ స్పష్టం!
కర్నూలు: ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా, అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యతతో కూడిన పరిష్కారాలను అందించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (Public Grievance Redressal System - PGRS) లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్వీకరించారు.
కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న ప్రతి అర్జీని అధికారులు ప్రాధాన్యతతో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. పిటిషనర్లకు అందించే ఎండార్స్‌మెంట్‌లు స్పష్టంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండాలన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించడం సాధ్యం కాని పరిస్థితుల్లో, కారణాలను పూర్తిగా వివరించి పిటిషనర్లకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, వాస్తవ పరిస్థితులను తెలుసుకొని సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోని, ప్రజలకు న్యాయం జరిగేలా వ్యవహరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..పీజీఆర్ఎస్‌లో నమోదవుతున్న “రీ ఓపెన్” మరియు “ఇంప్రాపర్ రెడ్రెసల్” కేసుల శాతాన్ని పూర్తిగా తగ్గించే దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డిఆర్ఓ సి.వెంకటనారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య, అనురాధ, శివప్రసాద్ రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియం వద, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.




