Kurnool: స్వచ్ఛ ఆంధ్ర - 2026 అవార్డులు సాధించేలా చర్యలు తీసుకోవాలి

Kurnool: కర్నూలు జిల్లాలో స్వచ్ఛ ఆంధ్ర - 2026 అవార్డులను దక్కించుకునేందుకు 21 ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 29 Aug 2026 7:18 PM IST
Kurnool
X

Kurnool: స్వచ్ఛ ఆంధ్ర - 2026 అవార్డులు సాధించేలా చర్యలు తీసుకోవాలి

కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇవ్వనున్న స్వచ్ఛ ఆంధ్ర - 2026 అవార్డులను కర్నూలు జిల్లాలో ప్రభుత్వ శాఖలు సాధించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో 21 ప్రభుత్వ విభాగాల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న స్వచ్ఛ ఆంధ్ర - 2026 అవార్డుల నిమిత్తం ఇచ్చిన టూల్ కిట్ ను వినియోగించుకుని కర్నూలు జిల్లా ప్రభుత్వ శాఖలు అవార్డులు సాధించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమములో ముఖ్యభూమికలు పోషిస్తున్న 21 ప్రభుత్వ శాఖలకు చెందిన సంస్థలు... స్వచ్ఛ మునిసిపాలిటీలు , స్వచ్ఛ గ్రామ పంచాయతీలు , స్వచ్ఛ ఎస్ ఎల్ ఎఫ్ లు , స్వచ్ఛ గ్రామ ఆర్గనైజేషన్ లు , స్వచ్ఛ పాఠశాలలు , స్వచ్ఛ అంగన్వాడీ కేంద్రాలు , స్వచ్ఛ ప్రభుత్వ ఆసుపత్రులు , స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలు , స్వచ్ఛ ఆర్టీసీ బస్టాండ్లు , స్వచ్ఛ రైతు బజార్ లు , స్వచ్ఛ విద్యార్థి వసతి గృహాలు , స్వచ్ఛ పరిశ్రమలు / ఎంఎస్ఎమ్ఈలు , స్వచ్ఛ స్వచ్ఛంద సేవా సంస్థలు , స్వచ్ఛ పారిశుద్ధ కార్మికులు , స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్లు , స్వచ్ఛ గురుకుల పాఠశాలలు , స్వచ్ఛ కాలనీలు , స్వచ్ఛ పర్యాటక కేంద్రాలు /చారిత్రాత్మక ప్రదేశాలు - కట్టడాలు , స్వచ్ఛ పట్టణ / నగర ఉద్యానవనాలు , స్వచ్ఛ దేవాలయాలు / మత సంస్థలు , స్వచ్ఛ రైల్వే స్టేషన్ లు అవార్డులను సాధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ప్రతి శాఖకు చెందిన అత్యంత ముఖ్యమైన 5 సంస్థలను జిల్లా అధికారి, జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో ఎన్నిక చేసుకొని వాటికి సంబంధించిన వివరాలు సెప్టెంబరు 1వ తారీకు నుండి 8 వ తారీకు లోగా జిల్లా కలెక్టర్ వారికి మరియు సంబంధిత రాష్ట్రశాఖ కార్యాలయానికి స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర వెబ్సైట్లో ఇచ్చిన టూల్ కిట్ ద్వారా తెలపాలని ఆదేశించారు. సంబంధిత రాష్ట్ర కార్యాలయం నుండి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కార్యాలయానికి వివరాలను పంపుతారని, వారు స్వచ్ఛ ఆంధ్ర 2026 అవార్డులకు ఎన్నిక చేస్తారని కలెక్టర్ తెలియజేశారు.

రాష్ట్రస్థాయి అవార్డులను రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు మీదుగా అందజేయబడతాయని తెలిపారు.అదే విధంగా జిల్లాలో ఎన్నుకోబడిన వాటి నుండి మూడింటిని జిల్లా కలెక్టర్ నిర్ణయించి జిల్లా స్థాయిలో జిల్లా ఇన్చార్జి మంత్రి /జిల్లా మంత్రి మరియు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర 2026 అవార్డులు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ తెలియజేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు జాగ్రత్తగా మీ సంస్థలను ఎన్నుకొని పోటీకి పంపవలసిందిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి తెలియజేశారు.

ఈ సమావేశానికి కర్నూలు మున్సిపల్ కమీషనర్ చల్లా ఓబులేసు , స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డ్ అధికారి భాస్కర్ నాయుడు , బి సి - ఎస్ సి సంక్షేమ అధికారులు ప్రసూన , రాధిక లు , డి ఆర్ డి ఏ పీడీ శ్రీధర్ రావు , డి ఎం హెచ్ ఓ కామేశ్వరప్రసాద్ , డీసీహెచ్ జఫరుల్లా, డి ఈ ఓ సుధాకర్ , ఎస్ ఎస్ ఏ ఏపి.సి. లోకరాజు , జిఎం డిఐసి సంజీవ రాజు, మెప్మా పిడి శ్రీనివాసులు , ఆదోని మున్సిపల్ కమిషనర్ నయీమ్ , పిడి ఐసిడిఎస్ విజయ మైనారిటీ వెల్ఫేర్ సబిహ పర్వీన్ , ఏసీ ఎండోమెంట్ సుధాకర్ రెడ్డి , డిటిఓ సురేష్ , టూరిజం అధికారి తిరుమల నాయుడు , కేఎంసీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రఘు మొదలగువారు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story