Kurnool: ఎమ్మిగనూరులో ఘనంగా బీజేపీ అసెంబ్లీ కార్యాలయం ప్రారంభం
Kurnool: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బీజేపీ అసెంబ్లీ కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ. హాజరైన అధికార ప్రతినిధి గురురాజా దేశాయ్.
Kurnool: ఎమ్మిగనూరులో ఘనంగా బీజేపీ అసెంబ్లీ కార్యాలయం ప్రారంభం
కర్నూలు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి గురురాజా దేశాయ్ ఆధ్వర్యంలో ఏర్పటు చేసిన బీజేపీ అసెంబ్లీ కార్యాలయంను జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ముందుగా బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి, కార్యకర్తలు, నాయకుల నినాదాల మధ్య కార్యాలయం కు చేరుకొని జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ చేతుల మీదుగా, పార్టీ జెండాను ఆవిష్కరించి, అనంతరం రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకూ బలపడుతోందని, పెద్ద సంఖ్యలో ప్రజలు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని తెలిపారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థాయిల్లో బలంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోందని ఆయన వెల్లడించారు. ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి పార్టీ విధానాలను తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.బీజేపీలో ఎలాంటి వర్గాలు లేవని, అందరూ ఒక్కటిగా కలిసి పార్టీ విజయానికి కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ స్పష్టం చేశారు.




