Kurnool: పత్తికొండలో విద్యార్థుల అరెస్టులు సిగ్గుచేటు AISF
Kurnool: కర్నూలు జిల్లా పత్తికొండలో విద్యార్థి నాయకుల అరెస్టును ఖండించిన ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి. సోమన్న. అక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్.
Kurnool: పత్తికొండలో విద్యార్థుల అరెస్టులు సిగ్గుచేటు AISF
కర్నూలు: విద్యార్థులను అరెస్టు చేసి కేసు పెట్టడం సిగ్గుచేటు వెంటనే కేసులను ఉపసంహరించుకోవాలి. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ పత్తికొండ మండలంలోని విద్యార్థి నాయకులను అరెస్టు చేసి వారిపై కేసు పెట్టడం సిగ్గుచేటు అయినటువంటి విషయమని దీన్ని ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీగా తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి సోమన్న ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తికొండ ఎమ్మెల్యే నియంత పాలన కొనసాగిస్తున్నారు అని ఆయనకు కావలసినది ఆయన దగ్గర ఉంచుకోవడం కోసం ఈ ఈ పనులు చేపడుతా ఉన్నాడని పత్తికొండ నియోజకవర్గానికి వచ్చినటువంటి జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను పత్తికొండలో కాకుండా అతని సొంత గ్రామంలో పెట్టుకోవడంలోనా అంతర్యం ఏమిటో చెప్పాలని నిజంగా కంబలపాడు కి ఎక్కడి నుంచి రోడ్లు వస్తున్నాయి నిజంగా కంబలపాడు నియోజకవర్గము అనుకుంటున్నారేమో అన్నదాన ఆలోచించుకోవాలని ఆయన అన్నారు.
అదే కాకుండా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను నియోజకవర్గ సెంటర్లో పెడితే అనేక మండలాల్లో ఆ మండలాల సమీపాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజల పిల్లలు కూడా అక్కడ చదువుకునే అవకాశం ఉంటుందని మారుమూల ప్రాంతంలో పెడితే వసతి గృహాలు కానీ గురుకులాలు కానీ ఏ విధమైనటువంటి అభివృద్ధి చెందవని విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తా ఉందని అటువంటి పరిస్థితుల్లోనే అఖిల భారత విద్యార్థి సమాఖ్య అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలోన విద్యార్థి యువజనులు నిరసనలు తెలియజేస్తా ఉన్నారని ఈ నిరసనలను ఏమాత్రం పట్టించుకోకుండా నేనే ఎమ్మెల్యే అనే విధంగా ఎమ్మెల్యే శ్యాంబాబు ఇప్పటివరకు స్పందించకపోవడం విద్యార్థులు ఉద్యమం చేస్తా ఉంటే వారి మీద అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు.
శ్యాంబాబు గారికి అధికారం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ఇలా చేస్తూ ఉంటే మీ విజ్ఞత మీదనే వదిలేస్తా ఉన్నామని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వారు హెచ్చరించారు ఇకనైనా విద్యార్థుల మీద పెట్టిన కేసులను కానీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల మీద తక్షణమే ఎమ్మెల్యే స్పందించాలని లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలోన ఎమ్మెల్యే కేఈ శాంబాబు గారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.




