Nandyal: గోదావరి అనుసంధానం సాధ్యమా? ఇంజనీర్లను నిలదీసిన కేఆర్ఎంబీ
Nandyal: ఆత్మకూరులోని బానకచర్ల, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులను కేఆర్ఎంబీ బృందం పరిశీలించింది.
Nandyal: గోదావరి అనుసంధానం సాధ్యమా? ఇంజనీర్లను నిలదీసిన కేఆర్ఎంబీ
Nandyal: ఆత్మకూరు డివిజన్ బనక చర్ల క్రాస్ కాంప్లెక్స్ సముదాయాన్ని కృష్ణానది యాజమాన్య బోర్డు పరిశీలించింది. కె ఆర్ ఎం బి చైర్మన్ ఎస్. విశ్వాస్, బోర్డు కార్యదర్శి సతీష్ కుమార్ కాంబోజి, సభ్యుడు జన్గిడ్ స్థానిక ఇంజినీర్లతో కలసి తనిఖీ చేసారు. అలాగే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల ముఖద్వారం పోతిరెడ్డిపాడు తనిఖీ చేసి ప్రాజెక్ట్, నీటి విడుదల వివరాలను తెలుసుకున్నారు. కృష్ణ, పెన్నా బేసిన్ల సరిహద్దులు విడుదల చేస్తున్న నీటి వివరాలపై ఆరా తీశారు.
బానకచర్ల నీటి నియంత్రణ కాంప్లెక్స్ నుంచి తెలుగు గంగ, కేసి ఎస్కేప్ ఛానల్, ఎస్ ఆర్ బి సి, జి ఎన్ ఎస్ ఎస్ ప్రాజెక్టుల స్థితిగతులు నీటి విడుదలపై తాజా గణాంకాలను జల వనరుల శాఖ అధికారుల నుంచి కే ఆర్ ఎం బి బృందం సేకరించింది.. కె ఆర్ ఎం బి ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేక స్థానిక ఇంజనీరింగ్ అధికారులు కంగారుపడ్డారు. గోదావరి జలాలను పెన్నా బేసిన్ సరిహద్దు బానకచర్ల క్రాస్ కాంప్లెక్స్ కు అనుసంధానించడం సాధ్యమేనా అని ఇంజనీర్లను కేఆర్ ఎంబి బృందం ఆరాతీసింది..
బానక చర్ల నుంచి విడుదల చేసే 20 శాతం జలాలు పెన్నా బేసిన్ ద్వారా నెల్లూరు, చిత్తూరు వరకు 80 శాతం జలాలచెరి ఎక్కువ లబ్ది చేకూరుతుందని కృష్ణ యాజమాన్య బోర్డు అభిప్రాయపడింది. వెలుగొండ ప్రాజెక్టు, నల్లమల సాగర్ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బానకచర్ల క్రాస్ కాంప్లెక్స్ ద్వారా ఏడాదిలో రాయలసీమకు 200 టిఎంసిల కృష్ణా జలాలు అందుతున్నాయన్న నీటి గణాంకాలను పరిశీలించి కేఆర్ ఎంబి బృందం ఆశ్చర్యానికి లోనయ్యింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద 15 నిమిషాలు మాత్రమే గడిపిన కె ఆర్ ఎం బి బృందం ఆ వెంటనే తమ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ కు పయనమైంది. .
బానకచర్ల క్రాస్ కాంప్లెక్స్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పరిశీలనను తూతు మంత్రంగా ముగించి హడావుడిగా కృష్ణానది యాజమాన్య బోర్డు మీడియాతో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపొయంది.




