Nandyal: కోవెలకుంట్లలో ‘సేవ్ వాటర్’ నినాదంతో విద్యార్థుల ర్యాలీ!

Nandyal: నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో ‘సేవ్ వాటర్ - సేవ్ లైఫ్’ నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

Ramanaiah, Banaganepalle
Published on: 8 Sept 2026 1:57 PM IST
Nandyal
X

Nandyal: కోవెలకుంట్లలో ‘సేవ్ వాటర్’ నినాదంతో విద్యార్థుల ర్యాలీ!

Nandyal: సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్, కోవెలకుంట్ల ఆధ్వర్యంలో “Save Water – Save Life” అనే సందేశంతో విద్యార్థుల ర్యాలీ నిర్వహించారు నీటి ప్రాముఖ్యత, నీటి సంరక్షణ అవసరంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విద్యార్థులు నినాదాలతో ర్యాలీ చేపట్టారు.

“నీరు వృథా చేయవద్దు – ప్రతి చుక్కను కాపాడుదాం”, “నీరు ఉంటేనే జీవితం” వంటి నినాదాలతో విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించారు భవిష్యత్ తరాలకు నీటి కొరత రాకుండా ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించాలని విద్యార్థులు సందేశమిచ్చారు.

ఈ కార్యక్రమంలో కోవెలకుంట్ల ఎంపీడీఓ ప్రసాద్ సార్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న వయసు నుంచే పిల్లల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించాలని సూచించారు.

ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ గీత నాయకత్వం వహించారు. ఉపాధ్యాయ బృందం కూడా కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ర్యాలీని PD హర్ష మరియు PD ఒబులేష్ సమన్వయం చేశారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. “ప్రతి చుక్క విలువైనదే – నీటిని కాపాడితేనే జీవితం సురక్షితం.”

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story