Kovelakuntla: కోవెలకుంట్లలో కృష్ణాష్టమి వేడుకలు: పల్లకి మోసిన బీసీ రాజారెడ్డి!

Kovelakuntla: కోవెలకుంట్లలో త్రైత సిద్ధాంతం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని స్వామివారి పల్లకి మోసిన మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి.

Ramanaiah, Banaganepalle
Published on: 8 Sept 2026 5:43 PM IST
Kovelakuntla
X

Kovelakuntla: కోవెలకుంట్లలో కృష్ణాష్టమి వేడుకలు: పల్లకి మోసిన బీసీ రాజారెడ్డి!

నంద్యాల జిల్లా: ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత లభిస్తుందని బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్ , అరుణ భారతి సాహితీ సంస్థ అధ్యక్షులు బిసి రాజారెడ్డి అన్నారు. కోవెలకుంట్ల పట్టణంలోని స్టేట్ బ్యాంక్ రోడ్డు నందు త్రైత సిద్ధాంతము వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు బిసి రాజారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ముందుగా కోవెలకుంట్ల కు చేరుకున్న బిసి రాజారెడ్డికి ప్రబోధ సేవా సమితి వారు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బిసి రాజారెడ్డి శ్రీకృష్ణ పరమాత్మకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకృష్ణ ప్రతిమ ఊరేగింపు మహోత్సవంలో పాల్గొన్నారు. శ్రీకృష్ణుని పల్లకి మోసి ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈనెల 4వ తేదీ నుండి మంగళవారం వరకు ఎంతో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్న ప్రబోధ సేవా సమితి సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తనను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో ప్రబోధ సేవా సమితి కోవెలకుంట్ల కమిటీ అధ్యక్షులు జనార్ధన్, ఉపాధ్యక్షులు రామసుబ్బారెడ్డి, సభ్యులు సూర్యుడు, సుబ్బరాయుడు, రవికుమార్, మధుసూదన్ , సర్వదారి, సుబ్బారావు, సుధాకర్, చౌడయ్య, లీలావతి, సుశీల, సుగుణ, సులోచన పాల్గొన్నారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story