Koilakuntla: తల్లిదండ్రులపై కన్నపేగు ప్రేమ ఎకరా స్థలంలో స్మృతివనం!

Koilakuntla: కోవెల‌కుంట్ల‌ రిటైర్డ్ లైబ్రేరియన్ పల్లె నరసింహారెడ్డి ఆదర్శం. తల్లిదండ్రుల స్మృత్యర్థం 'ప్రకృతి పీఠం' ఆశ్రమం, స్మృతి వనం ఏర్పాటు. నిత్య అన్నదానం.

Ramanaiah, Banaganepalle
Published on: 23 July 2026 12:46 PM IST
Koilakuntla
X

Koilakuntla: తల్లిదండ్రులపై కన్నపేగు ప్రేమ ఎకరా స్థలంలో స్మృతివనం!

Koilakuntla: సమాజంలో తల్లిదండ్రులను పట్టించుకోకుండా రోడ్డుపైన వదిలేసి వెళ్లి పోయిన సంఘటనను ఎన్నో చూశాం కానీ,

కోవెలకుంట్ల పట్టణానికి చెందిన రిటైర్డ్ లైబ్రరీయన్ పల్లె నరసింహారెడ్డి పకృతి పీఠం అనే సంస్థను ఏర్పాటు చేసి తన తల్లిదండ్రుల కోసం ఒక ఎకరా స్థలంలో స్మృతి వనం ఏర్పాటు చేశాడు ప్రతి సంవత్సరం తల్లిదండ్రులకు ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నాడు.

ఓం నమో నారాయణ అంటూ పలికే వారందరికీ నిత్య అన్నదానం ఏర్పాటు చేశారు.

తల్లిదండ్రులు కారణజన్ములు తల్లిదండ్రుల గొప్పతనాన్ని తెలుసుకొని ఈ ఆశ్రమం ఏర్పాటు చేశానని పల్లె నర్సింహారెడ్డి మీడియాకు తెలిపారు.

పకృతి పీఠం ఆశ్రమాన్ని చూసిన పెద్దమొడియం గ్రామానికి చెందిన నెమలి వెంకటేశ్వర రెడ్డి.

ఆశ్రమానికి ఈరోజు 200 ల మొక్కలు తీసుకుని వితరణ ఇచ్చాడు త్రీ గార్డ్ తయారు చేస్తానని వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.

కార్యక్రమంలో పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story