Kodumuru: కోడుమూరులో వర్షాల కోసం చిన్నారుల ప్రత్యేక పూజలు

Kodumuru: కర్నూలు జిల్లా కోడుమూరు భీమా లింగేశ్వర స్వామి కోట గుడిలో వర్షాలు సమృద్ధిగా కురవాలని చిన్నారులతో నీటి బిందెలు మోయించి ప్రత్యేక పూజలు.

C. Ganesh, Kodumuru
Published on: 20 July 2026 2:13 PM IST
Kodumuru
X

Kodumuru: కోడుమూరులో వర్షాల కోసం చిన్నారుల ప్రత్యేక పూజలు

Kodumuru: కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, కరవు కాటకాలు తొలగిపోవాలని కోరుకుంటూ స్థానిక భీమా లింగేశ్వర స్వామి ఆలయం కోట గుడి లో చిన్నపిల్లలతో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఒక సాంప్రదాయం.పూజా కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు, అర్చకులు కలిసి చిన్నారుల చేత తలపైన నీటి బిందెలను మోయించి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువస్తారు.

ఇలా తెచ్చిన పవిత్ర జలాలతో భీమా లింగేశ్వర స్వామికి ప్రత్యేక జలాభిషేకం జరుపుతారు.సకాలంలో వర్షాలు పడక కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు, వర్ణ దేవుడైన శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ విధమైన వినూత్న పూజలు చేస్తారు. చిన్నారుల మనసు ఎంతో పవిత్రమైనదని,

అమాయకత్వంతో కూడిన వారి ప్రార్థనలను దేవుడు త్వరగా ఆలకిస్తాడనే బలమైన నమ్మకంతో చిన్న పిల్లల చేత నీటి బిందెలను మోయిస్తారు.గ్రామీణ ప్రాంతాలలో వర్షాలు కురవనప్పుడు కరవును నశింపజేయడానికి తరతరాలుగా వస్తున్న ఇటువంటి ఆచారాలు ప్రజల నమ్మకానికి, సంస్కృతికి అద్దం పడతాయి.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru

Next Story