Kodumur: హంద్రీ నదిని పరిశీలించి కీలక ప్రకటన చేసిన ఎమ్మెల్యే దస్తగిరి!

Kodumur: కర్నూలు జిల్లా కోడుమూరు తాగునీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి రంగంలోకి దిగారు.

C. Ganesh, Kodumuru
Published on: 9 July 2026 12:42 PM IST
Kodumur
X

Kodumur: హంద్రీ నదిని పరిశీలించి కీలక ప్రకటన చేసిన ఎమ్మెల్యే దస్తగిరి!

Kodumur: కర్నూలు జిల్లా కోడుమూరులో తాగునీటి సమస్య పరిష్కారానికి స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారు క్షేత్రస్థాయిలో పర్యటించారు. కోడుమూరులో నెలకొన్న మంచినీటి ఎద్దడిపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే.. అధికారులతో కలిసి హంద్రీ నది పరివాహక ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. ప్రజల తాగునీటి కష్టాలను త్వరితగతిన తీర్చే మార్గాలపై అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించేలా.. గాజులదిన్నె ప్రాజెక్ట్ (సంజీవయ్య సాగర్) నుండి తక్షణమే నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీటిని హాంద్రీ నదికి మళ్లించి తాగునీటి కొరతను అధిగమిస్తామని హామీ ఇచ్చారు.

అంతేకాకుండా, కోడుమూరులో శాశ్వత తాగునీటి పరిష్కారం చూపేందుకు ఎమ్మెల్యే కీలక ప్రకటన చేశారు. గాజులదిన్నె ప్రాజెక్ట్ నుండి ప్రత్యేక పైప్‌లైన్ నిర్మాణం కోసం రూ. 39 కోట్లతో త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ పనులు పూర్తయితే కోడుమూరు పట్టణంలో తాగునీటి కష్టాలు శాశ్వతంగా తొలిగిపోతాయని ధీమా వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి, వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ ఎల్లప్ప నాయుడు, చేనేత భాస్కర్, ఎమ్పీటీసీ రవి, మాలమహానాడు ముని స్వామి తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru

Next Story