Kurnool: ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హామీలు

Kurnool: చనుగొండ్ల గ్రామంలో పర్యటించిన కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మెగా డీఎస్సీ పై దుష్ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీకి చర్చకు రావాలని సవాల్ విసిరారు.

C. Ganesh, Kodumuru
Published on: 11 Aug 2026 10:56 AM IST
Kurnool
X

Kurnool: ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హామీలు

Kurnool: కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేపట్టిన మెగా డీఎస్సీ పై గొడ్డలి పార్టీ నాయకులతో చర్చకు తాను సిద్ధమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సవాల్ విసిరారు.ఇంటింటికీ టీడీపి కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా గూడూరు మండలం చనుగొండ్ల గ్రామంలో పర్యటించారు .

గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల నియామకాలు చేపడుతుంటే, గొడ్డలి పార్టీ దగా డీఎస్సీ అని దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. డీఎస్సీపై ఎలాంటి అనుమానాలున్నా నివృత్తి చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, చర్చకు రావాలని సవాల్ చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సమానంగా పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru

Next Story