Kurnool: కోడుమూరులో ఘనంగా ‘మెగా కిసాన్ మేళా’: పాల్గొన్న ఎమ్మెల్యే!
Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరులో జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ATMA) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మెగా కిసాన్ మేళా’లో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు.
Kurnool: కోడుమూరులో ఘనంగా ‘మెగా కిసాన్ మేళా’: పాల్గొన్న ఎమ్మెల్యే!
కర్నూలు: కర్నూలు జిల్లా కోడుమూరులో జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా కిసాన్ లో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు.
ఎల్ నినో ప్రభావంంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా నేపథ్యంలో ఎల్ నినో ను సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి అనే అంశంతో పాటుగా రైతుల అభద్రత భావాన్ని తోలగించడాని శాస్త్ర వేత్తలు డైరెక్టర్ గా రైతులతో ఇంటరాక్ట్ అవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుందని చెప్పారు.వాణిజ్య పంటలను కాకుండా స్వల్పకాలిక పంటలను పండించాలని రైతు సోదరులకు సూచించారు.PMDS పథకం కిందా 30 రకాల పంట విత్తనాలను శుద్ధి చేసుకోవడానికి అవకాశం కలిపిస్తుందన్నారు.
రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తనాలను తీసుకోవాలని అన్నారు.అంతే కాకుండా సూక్ష్మ సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చి దీర్ఘకాలిక పంటలను వేసుకోవాలని, సేంద్రియ ఎరువులు వాడాలని దానితో పాటు భూసార పరీక్షలు చేయించుకోవాలి మెగా కిసాన్ మెళాలో పాల్గొన్న శాస్త్ర వేత్తలు రైతులకు సూచించారు.అంతేకాకుండా పశుగ్రాసం కోరత ఏర్పడకుండా పంట పండించే సమయంలోనే కొంత మేర గడ్డి విత్తనాలను నాటుకోవాలని దీంతో పశుగ్రాసం కోరత ఉండదంన్నారు.నీటి యాజమాన్య పథకాలను వాడుకోని తక్కువ నీటితో ఎక్కువ పంటలను దిగుబడి చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కేట్ యార్డ్ ఛైర్మన్ జయన్న, టిడిపి మండల అధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి, టిడిపి నాయకులు,శాస్త్ర వేత్తలు జిల్లా అధికారులు లతో పాటుగా రైతులు పాల్గొన్నారు.




