Kurnool: మెడకు ఉరితాళ్లతో కేసీ కెనాల్‌లో రైతుల వినూత్న నిరసన!
Kurnool: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కేసీ కెనాల్‌కు వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు వినూత్న నిరసన చేపట్టారు.
Kurnool: మెడకు ఉరితాళ్లతో కేసీ కెనాల్‌లో రైతుల వినూత్న నిరసన!
kurnool: రాయలసీమలో సాగునీటి కోసం రైతుల ఆందోళన ఉధృతమవుతోంది.. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుండి కేసీ కెనాల్ కు వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. ఏకంగా కేసీ కెనాల్ లోకి దిగి ఉరి తాళ్లు మెడలో వేసుకుని తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
రైతులు కెనాల్ లో ఉరితాళ్లతో నిరసన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుండి కేసీ కెనాల్ కు నీరు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో 875 అడుగులకు పైగా నీరు నిల్వ ఉన్నప్పటికీ, కేసీ కెనాల్ కు నీరు వదలకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.
నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ఎండిన కేసీ కెనాల్ లోకి దిగి మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. రైతుల గోడు ఈ కూటమి ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నిస్తున్నారు.
పంటలు కళ్ల ముందే ఎండిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా అని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ముచ్చుమర్రి నుండి కేసీ కెనాల్ కు నీరు విడుదల చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ రైతులు హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పుల్లల నాగిరెడ్డి గారు చంద్రారెడ్డి గారు నాగశైనా రెడ్డి మాజీ సర్పంచ్ శేషన్న ఆంజనేయులు పులింద్ర నాయుడు వెంకటేశ్వర్లు తదితరుల రైతులు పాల్గొన్నారు.




