Kurnool: వైఎస్సార్‌సీపీ ‘జగన్ 2.0 సూపర్ యాప్’.. పాణ్యంలో ఘనంగా ప్రారంభం
Kurnool: వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రామభూపాల్ రెడ్డి పాణ్యం నియోజకవర్గంలో "జగన్ 2.0 సూపర్ యాప్"ను ఆవిష్కరించారు.
Kurnool: వైఎస్సార్‌సీపీ ‘జగన్ 2.0 సూపర్ యాప్’.. పాణ్యంలో ఘనంగా ప్రారంభం
కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన "జగన్ 2.0 సూపర్ యాప్" ను పాణ్యం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు.
జగన్ 2.0 సూపర్ యాప్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ప్రజలతో నేరుగా అనుసంధానం అయ్యే శక్తివంతమైన వేదికగా నిలుస్తుందని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ కార్యక్రమాలను ప్రజలకు వేగంగా చేరవేయడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ప్రతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చేతిలో ఉండాల్సిన డిజిటల్ ఆయుధం. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వేగంగా చేరవేయడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందిని అన్నారు.
స్వయంగా తన మొబైల్‌లో 'జగన్ 2.0 సూపర్ యాప్'ను డౌన్‌లోడ్ చేసి, దాని వినియోగ విధానాన్ని నాయకులు, కార్యకర్తలకు వివరించి చూపించారు. అనంతరం ప్రతి కార్యకర్త తమ మొబైల్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రజలతో అనుసంధానమై పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు...*
ఈ కార్యక్రమంలో కర్నూలు నగర మాజీ మేయర్ బి వై రామయ్య, పాణ్యం నియోజకవర్గ అబ్జర్వర్ గుండంసూర్యప్రకాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మాజీ కార్పొరేటర్లు, నాయకులు, మహిళ నేతలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




