Srisailam: శ్రీశైలం భ్రమరాంబికాదేవి అమ్మవారికి బంగారు గోపుర కలశం విరాళం

Srisailam: శ్రీశైలం శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి కర్ణాటకకు చెందిన భక్తుడు 47 గ్రాముల లక్కతో కూడిన బంగారు గోపుర కలశాన్ని విరాళంగా సమర్పించారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 24 Aug 2026 8:41 AM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలం భ్రమరాంబికాదేవి అమ్మవారికి బంగారు గోపుర కలశం విరాళం

Srisailam: శ్రీశైలం శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారికి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం కర్ణాటక రాష్ట్ర భక్తుడు విరాళంగా అందజేశారు కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు చెందిన గురుబసప్ప కుటుంబ సభ్యులు లక్కతో కూడిన బంగారు కలశ గోపురాన్ని దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు.

లక్కతో కూడిన గోపుర కలశం బరువు 47 గ్రాములుగా ఉన్నట్లు భక్తుడు తెలిపాడు అమ్మవారి ఆలయప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు లక్కతో కూడిన బంగారు కలశాన్ని అమ్మవారి ఆలయ పర్యవేక్షకులు హరికృష్ణ రెడ్డి,ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు అందజేయగా విరాళ దాతకు దేవస్థానం తగు రశీదును అందజేసి వేదాశీర్వచనముతో పాటు శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు,ప్రసాదాలను భక్తుడికి దేవస్థానం అధికారులు అందజేశారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story