Kurnool: ఎమ్మిగనూరులో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత!
Kurnool: ఎమ్మిగనూరులో అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని జనసేన నాయకులు పట్టుకున్నారు. వాహనాన్ని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసిన పోలీసులు.
Kurnool: ఎమ్మిగనూరులో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత!
Kurnool: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో అక్రమ రేషన్ బియ్యం ముఠా ను జనసేన నాయకులు రట్టు చేశారు.15 రోజులుగా మాటు వేసి పక్కా సమాచారంతో అక్రమ బియ్యం తరలిస్తున్న బొలెరో ట్రాలీ వాహనాన్ని పట్టుకున్నారు.30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడినట్లు తెలిపారు.
వాహనాన్ని స్టేషన్ కు తరలించి పోలీసులకు అప్పగించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మిగనూరు లో పేదల బియ్యం పక్కదారి పడుతోందని దీని వెనక ఎవరున్నా శిక్షించాలని జనసేన నాయకుడు చల్లా వరుణ్ డిమాండ్ చేశారు.
ఎమ్మిగనూరు నుండి బొలెరో ట్రాలీ వాహనాల్లో ప్రతి నెలా డీలర్ల నుండి సేకరించిన రేషన్ జియాన్ని తరలించి కోడుమూరు లో లారీ లో లోడ్ చేస్తున్నారని ఆరోపించారు.పార్టీ పెద్దలకు ఈ విషయం చేరవేస్తానని వరుణ్ తెలిపారు.
Next Story




