Markapuram: విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాల మెరుగుదలే లక్ష్యం
Markapuram: మార్కాపురం, పల్నాడు జిల్లాల గిరిజన సంక్షేమ, గురుకుల విద్యాశాఖ అధికారులతో శనివారం (23.05.2026) ఆన్‌లైన్ ద్వారా సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.
Markapuram: విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాల మెరుగుదలే లక్ష్యం
మార్కాపురం: ప్రాజెక్ట్ అధికారి ఐటీడీఏ శ్రీశైలం పి.వి.ఎస్. నాయుడు గారు ఈరోజు (23.05.2026) నంద్యాల, మార్కాపురం, పల్నాడు జిల్లాలకు సంబంధించిన విద్యా శాఖ అధికారులతో ఆన్‌లైన్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మూడు జిల్లాల DTWOs, కన్వీనర్ ప్రిన్సిపాల్స్, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాలల విద్యా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థుల హాజరు, మౌలిక సదుపాయాల అంశాలపై జిల్లా వారీగా సమీక్ష చేపట్టారు.
ప్రత్యేకంగా:
సప్లమెంటరీ కోచింగ్ సెంటర్ల నిర్వహణ
సప్లమెంటరీ విద్యార్థుల హాజరు శాతం
పాఠశాలల సంసిద్ధత చర్యలు
పాఠశాలల్లో కొనసాగుతున్న మరమ్మత్తుల పనులు
నూతన అడ్మిషన్లు (New Enrolments)
ఇతర విద్యా సంబంధిత అంశాలపై పాఠశాలల వారీగా సమీక్షించారు. పాఠశాలల పనితీరును మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రాజెక్ట్ అధికారి పి.వి.ఎస్. నాయుడు సూచించారు.
ఈ సమావేశంలో DTWOs – నంద్యాల, మార్కాపురం, పల్నాడు జిల్లాల అధికారులు, APO (Edn.) పి. రామాంజనేయులు, మూడు జిల్లాల కన్వీనర్ ప్రిన్సిపాల్స్, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఆఫీస్ మేనేజర్ సీమోను, CMO చిన్న నాగరాజు మండ్లి, గురుకులం ఇన్‌చార్జ్ వెంకటేశ్వర్లు తదితర విద్యా విభాగ సిబ్బంది పాల్గొన్నారు.




