Markapuram: మార్కాపురం జిల్లా అడ్మిన్ ఓఎస్డీగా ఐపీఎస్ నవజ్యోతి మిశ్రా!

Markapuram: నూతనంగా ఏర్పాటవుతున్న మార్కాపురం జిల్లా అడ్మిన్ ఓఎస్డీ గా ఐపీఎస్ అధికారి నవజ్యోతి మిశ్రాను నియమిస్తూ సీఎస్ సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 6 July 2026 2:36 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం జిల్లా అడ్మిన్ ఓఎస్డీగా ఐపీఎస్ నవజ్యోతి మిశ్రా!

మార్కాపురం: నూతనంగా ఏర్పాటవుతున్న మార్కాపురం జిల్లా పరిపాలనా వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లా (అడ్మిన్) ఓఎస్డీ (Officer on Special Duty)గా ఐపీఎస్ అధికారి నవజ్యోతి మిశ్రాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పరిపాలన ఏర్పాటుకు సంబంధించిన సమన్వయ కార్యక్రమాలు, పరిపాలనా వ్యవస్థ రూపకల్పన, శాఖల మధ్య సమన్వయం వంటి బాధ్యతలను ఓఎస్డీగా నవజ్యోతి మిశ్రా పర్యవేక్షించనున్నారు.

నవజ్యోతి మిశ్రా ఆయన గతంలో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఏఎస్పీగా సమర్థవంతంగా సేవలందించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు అందుబాటులో ఉండే పరిపాలన, సమర్థవంతమైన విధి నిర్వహణతో మంచి గుర్తింపు పొందారు.

మార్కాపురం జిల్లా అడ్మిన్ ఓఎస్డీగా ఆయన నియామకంతో జిల్లా పరిపాలనా ఏర్పాట్లు మరింత వేగవంతం అవుతాయని అధికారులు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story