Nandyal: నంద్యాల మూలసాగరంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం!

Nandyal: నంద్యాల పట్టణంలోని 31వ వార్డు మూలసాగరంలో టీడీపీ ఆధ్వర్యంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ నిర్వహించి, కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.

R Pavankalyan, Nandyal
Published on: 9 Aug 2026 10:18 AM IST
Nandyal
X

Nandyal: నంద్యాల మూలసాగరంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం!

Nandyal: నంద్యాల పట్టణంలోని 31వ వార్డు మూలసాగరంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్‌ఎండి ఫయాజ్, 31వ వార్డు ఇంచార్జ్ దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి గడపకు వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.

కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు.. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్‌ఎండి ఫయాజ్ మాట్లాడుతూ..తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజలతో మమేకమై పనిచేసే పార్టీ అని అన్నారు. అందుకే ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలను తెలుసుకుంటున్నామని చెప్పారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

మూలసాగరంలో ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఫయాజ్ హామీ ఇచ్చారు. సొంత ఇల్లు లేని అర్హులైన పేద కుటుంబాలకు టిడ్కో ఇళ్ల విషయంలోనూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మేరకు లబ్ధి చేకూరేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

అనంతరం 31వ వార్డు ఇంచార్జ్ దీపక్ రెడ్డి మాట్లాడుతూ..‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకూ వెళ్లి ప్రజలను కలుసుకుంటున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు.

మూలసాగరం, ఇస్లాంపేట ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు.

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని దీపక్ రెడ్డి అన్నారు.

మూలసాగరం అభివృద్ధికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పనిచేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌ఎండి ఫయాజ్, 31వ వార్డు ఇంచార్జ్ దీపక్ రెడ్డి, భార్గవ రెడ్డి, జీ. రవి రెడ్డి, సి. భాస్కర్, నరసింహులు, కే. రవికుమార్, మణికంఠ, జి. శంకర్ రెడ్డి, విశ్వం తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal

Next Story