Kodumuru: సీఐ తబ్రేజ్ ఆధ్వర్యంలో కోడుమూరులో గణేష్ ఉత్సవాలు!
Kodumuru: కోడుమూరులో సిఐ తబ్రేజ్ ఆధ్వర్యంలో హిందూ, ముస్లిం సోదరులు కలిసి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన వేడుక.
Kodumuru: సీఐ తబ్రేజ్ ఆధ్వర్యంలో కోడుమూరులో గణేష్ ఉత్సవాలు!
Kodumuru: కర్నూలు జిల్లా కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ తబ్రేజ్ ఆధ్వర్యంలో హిందూ, ముస్లిం సోదరులు కలిసి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇరు వర్గాల వారు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఐ తబ్రేజ్ మాట్లాడుతూ.. వినాయక చవితి భారతీయులందరూ కలిసి జరుపుకునే పండుగ అని అన్నారు. మత సామరస్యం, సోదరభావానికి ఇటువంటి కార్యక్రమాలు ప్రతీకగా నిలుస్తాయని తెలిపారు. హిందూ, ముస్లిం సోదరులు కలిసి పండుగలు జరుపుకోవడం ద్వారా సమాజంలో ఐక్యత మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
ప్రజలందరూ పరస్పర సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని సీఐ తబ్రేజ్ కోరారు . ఈ కార్యక్రమంలో గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, ముస్లిం మైనారిటీ సభ్యులు తదితరులు పాల్గొనారు.




