Markapuram: విద్యతో పాటు క్రమశిక్షణ ముఖ్యం: గుటూరి ఫౌండేషన్ చైర్మన్!

Markapuram: మార్కాపురం సుందరయ్య కాలనీ, మన్నెవారిపల్లి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుటూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నోటు పుస్తకాలను సోమవారం పంపిణీ చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 29 Jun 2026 1:43 PM IST
Markapuram
X

Markapuram: విద్యతో పాటు క్రమశిక్షణ ముఖ్యం: గుటూరి ఫౌండేషన్ చైర్మన్!

మార్కాపురం: పట్టణంలోని సుందరయ్య కాలనీ, మన్నెవారిపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. బెంగళూరుకు చెందిన గుటూరి ఫౌండేషన్ చైర్మన్ నాగరాజ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి అవసరమైన నోటు పుస్తకాలను అందజేశారు.

ఈ సందర్భంగా నాగరాజ మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణను అలవర్చుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన విద్యా సామగ్రిని అందించేందుకు తమ ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

నోటు పుస్తకాలు అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేయగా, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుటూరి ఫౌండేషన్ సేవలను అభినందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఫౌండేషన్ సభ్యులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story