Gudur: గంజాయి గుట్టురట్టు.. బైక్‌పై రవాణా చేస్తున్న ముగ్గురు అరెస్ట్

Gudur: గూడూరు పులకుర్తి క్రాస్ రోడ్డులో 751 గ్రాముల గంజాయి స్వాధీనం. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన సీఐ తబ్రేజ్, ఎస్ఐ రాజ కుళ్లయప్ప బృందం.

C. Ganesh, Kodumuru
Published on: 2 July 2026 4:06 PM IST
Gudur
X

Gudur: గంజాయి గుట్టురట్టు.. బైక్‌పై రవాణా చేస్తున్న ముగ్గురు అరెస్ట్

గూడూరు: పట్టణంలోని పులకుర్తి క్రాస్ రోడ్డులో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. తబ్రేజ్ సమాచారం మేరకు గూడూరు ఎస్‌ఐ సిబ్బంది ఒక హీరో సీబీ షైన్ మోటార్ బైక్ పై (నెం. AP-39-BE-7555) ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, పరిశీలించగా వారి వద్ద ఉన్న మూడు కవర్లలో మొత్తం 751.20 గ్రాముల గంజాయి లభ్యమైంది.

VIVO మొబైల్ ఫోన్ మరియు గంజాయి రవాణాకు ఉపయోగించిన బైక్ ను స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. నిందితులు భక్త కృష్ణమూర్తిబోయ వెంకట్రాముడు బెస్త ఉదయ్ కుమార్ వీరిపై ఎన్‌డీపీఎస్ చట్టం, 1985లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బి.రాజ కుళ్లయప్ప తెలిపారు.

మత్తు పదార్థాల రవాణా, విక్రయాలు, వినియోగం గురించి సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే సమీప పోలీసు స్టేషన్‌కు తెలియజేయాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని గూడూరు ఎస్ఐ అన్నారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru

Next Story