banaganapalle: మాజీ గవర్నర్ పెండేకంటి వెంకటసుబ్బయ్య జయంతి వేడుకలు!
banaganapalle: బనగానపల్లె పాలిటెక్నికల్ కాలేజీలో బీహార్, కర్ణాటక రాష్ట్రాల మాజీ గవర్నర్ దివంగత పెండేకంటి వెంకటసుబ్బయ్య 105వ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.
banaganapalle: మాజీ గవర్నర్ పెండేకంటి వెంకటసుబ్బయ్య జయంతి వేడుకలు!
బనగానపల్లె: నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని పాలిటెక్నికల్ కాలేజీలో బీహార్ కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసిన దివంగత పెండేకంటి వెంకటసుబ్బయ్య 105 వ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.
నంద్యాల జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు టంగుటూరి శీనయ్య అకాడమీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాసులు ప్రిన్సిపల్ జీవి రమణారెడ్డి ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థి విద్యార్థులతో కలిసి పెండేకంటి వెంకటసుబ్బయ్య విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం లోని సంజామల గ్రామానికి చెందిన పెండేకంటి వెంకటసుబ్బయ్య 1984వ సంవత్సరంలో బనగానపల్లె లో పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేసి పేద, మధ్య తరగతి తరగతి కుటుంబాల పిల్లలను చదివించి ఉన్నత స్థాయిలో చూడాలని ఆకాంక్షతో కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది.
బనగానపల్లె నియోజవర్గంలో ఎంతోమందికి చేయూతనిచ్చిన గొప్ప వ్యక్తి అని నంద్యాల ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ రావడానికి ముఖ్య కారకుడైన పెండేకంటి వెంకటసుబ్బయ్య ను ఈరోజు మనము స్మరించుకోవడం గొప్ప వరంగా భావిస్తున్నామని నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు టంగుటూరి శీనయ్య అన్నారు.
పాలిటెక్నిక్ కళాశాలలోని ఫోర్త్ క్లాస్ స్టాప్ అందరికీ చీరలు పంపిణీ చేసిన నంద్యాల జిల్లా అధ్యక్షులు టంగుటూరు శీనయ్య కార్యక్రమంలో గాదంశెట్టి వేణుగోపాల్ అడ్వకేట్ అల్లి హుస్సేన్ శ్రీనివాసులు, శ్రీరామ సుబ్రహ్మణ్యం, గుండా రవికుమార్, పి ఎస్ ఎన్ సత్యం జంగం శెట్టి, శరత్ బాబు, బచ్చు శరత్ చంద్రకుమార్, సాయిరాం, కాఫీ పొడి శివయ్య, తదితరులు పాల్గొన్నారు.




