Dhone: పసిపిల్లల హాహాకారాలు.. డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది?
Dhone: నంద్యాల జిల్లా డోన్ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపి సేవలపై రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Dhone: పసిపిల్లల హాహాకారాలు.. డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది?
ధోన్: నంద్యాల జిల్లా డోన్ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపి సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉదయం నుంచే భారీగా రోగులు చేరడంతో గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఓపి టోకెన్లు ఇవ్వడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని, మధ్యలో వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలతో వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదనంగా ఆసుపత్రిలో మంచినీరు సౌకర్యం కూడా లేకపోవడంతో రోగులు మరింత ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. ప్రాథమిక సౌకర్యాల లేమిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు, అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story




