Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయంలో శాస్త్రోక్తంగా గోపూజ!

Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయ గోకులంలో కృష్ణాష్టమి వేడుకలు శాస్త్రోక్తంగా గోపూజ నిర్వహించిన ఈవో శ్రీనివాసరావు దంపతులు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 4 Sept 2026 5:19 PM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయంలో శాస్త్రోక్తంగా గోపూజ!

Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకను దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కృష్ణాష్టమి సందర్భంగా ఆలయంలోని శ్రీగోకులంలో దేవస్థానం తరుపున ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు గోపూజను నిర్వహించారు.

ప్రతినిత్యం ఆలయంలో ప్రాతకాల సమయంలో నిత్యసేవగా గోపూజ నిర్వహిస్తున్నప్పటికీ నేడు కృష్ణాష్టమి కావడంతో నిత్యసేవతో పాటు విశేషంగా గోపూజ జరిపించారు ముందుగా ఆలయప్రాంగణంలోని శ్రీ గోకులములో గోవులకు, గోవత్సాలకు (ఆవుదూడలకు) పూజాదికాలు జరిపి లోకకళ్యాణార్థం అర్చక,వేదపండితులు పూజా సంకల్పాన్ని పఠించి దేశం,రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పూజలు నిర్వహించారు.

తరువాత పూజాదికాలు నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజ శ్రీసూక్తంతోనూ,గో అష్టోత్తరమంత్రంతోనూ,గోవులకు షోడశ ఉపచారాలతో పూజాదికాలు నిర్వహించారు అనంతరం గోవులకు నివేదన, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు.

అయితే నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి,ప్రతి పనిలోని వైపిష్యాన్ని బోధించిన శ్రీకృష్ణ పరమాత్మ ఆవుల మంద అధికంగా ఉన్న కారణంగా గోకులం గా పేరొందిన వ్రేపల్లెలో పెరిగిన గోవులను కాశి గోపాలునిగా పేరుగాంచిన గోవు యొక్క అనంతమహిమను లోకానికి తెలియజేశారు ఈ కారణంగానే గోకులాష్టమి రోజున గోవును పూజించడం సాంప్రదాయమని తెలిపారు శ్రావణమాసం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story